Gold and Silver Rates: హమ్మయ్య అనుకునే లోపే.. మళ్ళీ పెరిగిన బంగారం.. ఎంతంటే.. 

బంగారం ఈరోజు (డిసెంబర్ 19) కాస్త పెరిగింది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 100 రూపాయలు పెరిగి రూ.57,400ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.110లు పెరిగి రూ.62,620లవద్దకు చేరుకున్నాయి. వెండి కూడా కేజీకి 300 పెరిగి రూ.80,000ల వద్ద నిలిచింది. 

New Update
Gold Rates:ఎట్టకేలకు దిగొచ్చిన పసిడి, వెండి ధరలు

Gold and Silver Rates: మొన్నటివరకూ పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈ వారం ప్రారంభం నుంచి కాస్త తగ్గుదల బాటలోకి వచ్చినట్టు కనిపించాయి. సోమవారం బాగా తగ్గిన బంగారం ధర.. మంగళవారం కూడా స్థిరంగానే ఉంది. అయితే.. ఈరోజు (డిసెంబర్ 19) మళ్ళీ బంగారం ధరలు పెరుగుదల బాట పట్టాయి. ఒక్కరోజు ధరలు తగ్గి మురిపించిన బంగారం మళ్ళీ ధరలు పెరిగి కొనుగోలుదారులను ఉసూరు మనిపించాయి. బంగారం ధరల్లో పెరుగుదల.. తగ్గుదల ఎప్పుడూ జరిగేదే అయినా.. ఈ మధ్య కాలంలో చాలా అస్థిరంగా బంగారం ధరలు ఉంటున్నాయి. దీంతో వినియోగదారులకు బంగారాన్ని ఎప్పుడు కొనాలి అనే విషయంలో ఎప్పుడూకన్ఫ్యూజన్ గా ఉంటోంది. ఇక వెండి ధరలు కూడా బంగారం ధరల్లానే పైకీ, కిందికీ కదులుతూ కేజీకి 80 వేల రూపాయాల చుట్టూనే ప్రదక్షణలు చేస్తున్నాయి. తాజాగా వెండి ధరలు ఈరోజు పెరుగుదల కనబరిచాయి. మంగళవారం (డిసెంబర్ 19) మార్కెట్ ప్రారంభ సమయానికి  హైదరాబాద్, ఢిల్లీ లో బంగారం, వెండి  ధరలు ఇలా ఉన్నాయి.    

హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold and Silver Rates) ధరలు 100 రూపాయలు పెరిగాయి.  ఈరోజు రూ.57,400ల దగ్గర చేరుకుంది.   24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 110 రూపాయల పెరుగుదల కనబర్చింది. దీంతో  రూ.62,620ల వద్దకు ఎగసింది.  అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 100 రూపాయలు పెరిగి రూ.57,550ల వద్ద చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold and Silver Rates) 110 రూపాయలు పెరిగి రూ.62,770లుగా ఉంది.  

Also Read:  హమ్మయ్య బంగారం కాస్త తగ్గింది.. ఇది గుడ్ న్యూసే కదా.. ఇప్పుడెంతంటే..  

మరోవైపు వెండి ధరలు కూడా ఈరోజు పెరుగుదల కనబరిచాయి. హైదరాబాద్ లో వెండి కేజీ వెండి ధర  300 రూపాయలు పెరిగింది. దీంతో మళ్ళీ 80 వేళా రూపాయల మార్క్ టచ్ చేసింది. ఈరోజు వెండి కేజీకి సరిగ్గా 80 వేల రూపాయలుగా ఉంది.  ఇక ఢిల్లీ లో కూడా కేజీ వెండి ధర 300 రూపాయలు పెరిగి 78 వేల రూపాయల వద్దకు చేరుకుంది. 

ఇక అంతర్జాతీయంగా బంగారం ధరలు(Gold and Silver Rates) ఈరోజు స్థిరంగా ఉన్నాయి.  ఈరోజు ఔన్స్ బంగారం(Gold Rates)  ఎటువంటి మార్పులు లేకుండా 2020డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర 24 డాలర్ల కంటే కింద స్థాయిలో స్థిరంగా ట్రేడ్ అవుతూ వస్తోంది. 

గమనిక: బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకున్నపుడు స్థానికంగా ఉన్న ధరలను పరిశీలించి చూసుకోవాలని సూచిస్తున్నాం. 

Watch this interesting Video:

Advertisment
తాజా కథనాలు