Gold and Silver Price: నిన్న ఒక్కసారిగా భగ్గుమన్న బంగారం ధరలు కాస్త దిగివచ్చాయి. వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న గోల్డ్ లవర్స్ కి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. నిన్న ఒక్కసారిగా వెయ్యి రూపాయలకు పైగా పెరిగి అందరినీ కంగారు పెట్టిన బంగారం ఈరోజు తగ్గి ఊపిరిపోసినట్టయింది. ఇక వెండి ధరలు కూడా నిన్న భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు వెండి ధరలు భారీగా పతనం అయ్యాయి. బంగారం ధరలు ప్రతిరోజూ పైకీ.. కిందికీ కదులుతూనే ఉంటాయి. బంగారం ధరల(Gold and Silver Price) తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో భారీగా తగ్గుదల నమోదు అయింది. అకస్మాత్తుగా డిమాండ్ తగ్గడం.. ఫెడ్ రేట్ల హడావుడిలో బంగారం వైపు మొగ్గు చూపిన ఇన్వెస్టర్స్ బంగారం నుంచి వెనక్కి తగ్గడంతో బంగారం ధరల్లో తగ్గుదలకు కారణంగా ఉంటున్నట్టు నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా బంగారం ధరలు ఇంకా తగ్గే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో బంగారం ధర మరి కాస్త తగ్గొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఇక ఈరోజు అంటే మార్చి23న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర(Gold and Silver Price) భారీగా తగ్గింది. దేశీయంగా ఆ ఎఫెక్ట్ కనిపించింది. దీంతో భారత్ లో బంగారం ధరలు తగ్గుదల నమోదు చేశాయి. మరోవైపు వెండి ధరలు భారీగా పతనం అయ్యాయి. ఈరోజు అంటే శనివారం (మార్చి23) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు(Gold Price) దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
హైదరాబాద్ లో బంగారం ధరలు..
హైదరాబాద్(Hyderabad) లో నిన్నపెరిగిన బంగారం ధరలు ఈరోజు కాస్త దిగి వచ్చాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold and Silver Price) 450 రూపాయలు తగ్గి రూ.61,500ల వద్ద ఉంది. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 490 రూపాయలు తగ్గి రూ.67,420ల వద్దకు చేరుకుంది.
ఢిల్లీలో బంగారం ధరలు ఇలా..
అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు(Gold Price) తగ్గాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 450 రూపాయలు తగ్గి (Gold and Silver Price) రూ.61,500ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 490 రూపాయలు తగ్గి రూ.67,080ల వద్ద నిలిచింది.
Also Read : వామ్మో..భగ్గుమన్న బంగారం..వెండి ధరల రికార్డులు.. ఎంత పెరిగాయంటే..
వెండి ధరలు ఇలా..
ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరల(Gold and Silver Price) తగ్గుదల తో ఉంటే.. మరోవైపు వెండి భారీగా పతనం అయింది. హైదరాబాద్ లో వెండి కేజీకి ఏకంగా 2000 రూపాయలు తగ్గింది. దీంతో రూ.79,500ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ కేజీ వెండి 2000 రూపాయలు తగ్గింది. దీంతో రూ. 76,500ల వద్దకు చేరుకుంది.
అంతర్జాతీయంగా..
మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీ తగ్గుదల నమోదు చేశాయి. ఈరోజు ఔన్స్ బంగారం(Gold Price) 16 డాలర్లు వరకూ తగ్గింది. దీంతో 2165.64 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర కూడా భారీగా తగ్గి (Gold And Silver Price) ఔన్స్ 24.68 డాలర్లుగా ఉంది.
గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకుంటే, అన్ని అంశాలను పరిశీలించి.. మార్కెట్ రేట్లను స్పష్టంగా తెలుసుకుని కొనుక్కోవడం మంచిది.