బంగారం ధరల (Gold and Silver Price)పెరుగుదల కొనసాగుతూనే ఉంది. వరుసగా రెండోరోజూ బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. అక్షయ తృతీయ పండుగ కోసం బంగారం కొనాలని అనుకునే వారికి బంగారం ధరల పెరుగుదల నిరాశను మిగులుస్తోంది. సోమా, మంగళవారాల్లో అంతర్జాతీయంగా బంగారం ధరల్లో పెరుగుదల చోటుచేసుకుంది. ఆ ప్రభావం దేశీయంగానూ కనిపించింది. అయితే, ఈరోజు బంగారం ధరలు అంతర్జాతీయంగా తగ్గుదల నమోదు చేస్తున్నాయి. ఈ ప్రభావంతో వచ్చే రెండు రోజుల్లో బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పడతాయని భావిస్తున్నారు. అయితే, ఈ తగ్గుదల భారీగా ఉండకపోవచ్చు. అంతకు ముందు రోజు కూడా పెరుగుదల నమోదు చేసిన బంగారం ధరలు(Gold and Silver Price) మళ్ళీ పెరుగుదల బాట పట్టడం ఆందోళన కలిగిస్తోంది. ఇక వెండి ధరలు కూడా ఈరోజు భారీగా పెరిగాయి.
పూర్తిగా చదవండి..Gold and Silver Price: బంగారం ధరల మోత..వెండి ధరల బాదుడు..ఈరోజు ఎంత పెరిగాయంటే..
ఈరోజు బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,350ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.72,380ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.88,500 వద్ద ఉంది.
Translate this News: