Godrej : 127 సంవత్సరాల చరిత్రకు బీటలు..వేరుపడిన గోద్రెజ్ కుటుంబం! 27 సంవత్సరాల చరిత్ర కలిగిన గోద్రెజ్ కుటుంబం వేరుపడింది. సబ్బుల నుంచి వ్యాపారాలు, ఆస్తుల వరకు అన్నింటిని పంచుకోవడానికి వారసులు ఓ ఒప్పందం చేసుకున్నారు.ఆది గోద్రేజ్ , ఆయన సోదరుడు నదిర్ లు ఇద్దరు కలిసి 5 లిస్టెడ్ గోద్రెజ్ ఇండస్ట్రీస్ ను తీసుకునేందుకు అంగీకరించారు. By Bhavana 01 May 2024 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి 127 Years History Of Godrej : 127 సంవత్సరాల చరిత్ర కలిగిన గోద్రెజ్(Godrej) కుటుంబం వేరుపడింది. సబ్బుల నుంచి వ్యాపారాలు, ఆస్తుల వరకు అన్నింటిని పంచుకోవడానికి వారసులు ఓ ఒప్పందం చేసుకున్నారు. ఆది గోద్రేజ్ , ఆయన సోదరుడు నదిర్ లు ఇద్దరు కలిసి 5 లిస్టెడ్ గోద్రెజ్ ఇండస్ట్రీస్ ను తీసుకునేందుకు అంగీకరించారు. వారి దాయాదులైన జంషెడ్ గోద్రేజ్ , స్మితా గోద్రెజ్ కృష్ణలు అన్ లిస్టెడ్ గోద్రెజ్ అండ్ బోయ్స్ తో పాటు దాని అనుబంధ సంస్థలతో పాటు ముంబై(Mumbai) లోని 3400 ఎకరాల విలువైన భూమి కూడా వారికి దక్కుతుందని సంస్థ పేర్కొంది. దీని ప్రకారం.. గోద్రేజ్ అండ్ బోయ్స్, సబ్సిడరీ కంపెనీలు గల గోద్రేజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌కు ఛైర్‌పర్సన్, ఎండీగా జెంషెడ్ గోద్రేజ్ నియమితులవుతారు. ఆయన సోదరి స్మితా కుమార్తె నైరికా హోల్కర్ (42) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. గోద్రేజ్ ఇండస్ట్రీస్(Godrej Industries), గోద్రేజ్ కన్జూమర్ ప్రొడక్ట్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్, ఆస్టెక్ లైఫ్‌సైన్సెస్, గోద్రేజ్ అగ్రోవెట్ వంటి నమోదిత కంపెనీలు ఉండే.. గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్‌కు ఛైర్మన్‌గా నదిర్ గోద్రేజ్ ఉంటారు. ఆది, నదిర్, వారి కుటుంబాలకు నియంత్రణ ఉంటుంది. ఆది కుమారుడు పిరోజ్ షా గోద్రేజ్ (42) ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకుంటారు. 2026 ఆగస్టులో నదిర్ నుంచి ఛైర్‌పర్సన్ బాధ్యతలు ఆయన తీసుకుంటారు. ఇరు గ్రూప్‌లు గోద్రేజ్ బ్రాండ్‌ను మాత్రం వినియోగించుకుంటాయి. 1897లో ఆర్దేశిర్ గోద్రేజ్, ఆయన సోదరుడు పిరోజ్ షా కలిసి ఈ కంపెనీని స్థాపించారు. అయితే ఆర్దేశిర్‌కు పిల్లలు లేరు. పిరోజ్‌కు వారసులు (సౌహ్రబ్, దోసా, నావల్, బుర్జోర్) ఉన్నారు. బుర్జోర్ (ఆది, నదిర్), నావల్ (జెంషెడ్, స్మిత) పిల్లలే ఇప్పుడు గ్రూప్‌ను నడుపుతున్నారు. ఈ గోద్రేజ్ గ్రూప్ విలువ దాదాపు రూ. 1.7 లక్షల కోట్ల కంటే ఎక్కువగా ఉంటుంది. తాళాలు తయారు చేసే కంపెనీగా ఇది మొదలై.. ఆ తర్వాత ప్రపంచంలోనే మొట్టమొదటి వెజిటేబుల్ ఆయిల్ సోప్ తయారు చేసింది. అప్పటివరకు జంతువుల కొవ్వుతో మాత్రమే సబ్బులు తయారయ్యేవి. 1944 సంవత్సరంలో బీరువాల తయారీలోకి అడుగుపెట్టింది. స్వాతంత్య్రం తర్వాత మొదటి ఎన్నికల్లో బ్యాలెట్ బాక్సులు కూడా గోద్రెజ్ సంస్థనే తయారు చేసింది. ఈ సమయంలో కూడా 85 కుపైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న గోద్రేజ్ గ్రూప్‌కు దాదాపు 120 కోట్ల మందికిపైగా కస్టమర్లు ఉన్నారు. చంద్రయాన్, మంగళ్‌యాన్ వంటి అంతరిక్ష ప్రయోగాల్లో కూడా గోద్రేజ్ సహకారం ఉంది. లూనార్ ఆర్బిట్ తయారీ, లాంచ్ వెహికిల్ తయారీకి తోడ్పాటు అందించింది. Also read: త్వరలోనే మరో బాహుబలి..రాజమౌళి నుంచి అఫీషీయల్ అనౌన్స్మెంట్! #separate #godrej #127-years-history-of-godrej మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి