Bhadrachalam: భద్రాచలం వద్ద ఉప్పొంగుతున్న గోదావరి...అలర్ట్‎గా ఉండాలన్న కలెక్టర్...!!

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతూనే ఉంది. శుక్రవారం ఉదయం 43.90అడుగులకు చేరుకున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రియాంక అల తెలిపారు.

New Update
Bhadrachalam: భద్రాచలం వద్ద ఉప్పొంగుతున్న గోదావరి...అలర్ట్‎గా ఉండాలన్న కలెక్టర్...!!

భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. ఇవాళ ఉదయం 7గంటలకు 43.90అడుగులకు చేరుకున్నట్లు జిల్లా కలెకట్ర్ ప్రియాంక అల తెలిపారు. గోదావరి నుండి 9 లక్షల 71 వేల 134 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. 20వ తేది రాత్రి 10 గంటలకు 44.30 అడుగులు వచ్చిన గోదావరి... ఈ రోజు ఉదయం 6 గంటలకు 43.90 అడుగులకు చేరిందని చెప్పారు. లక్ష్మీ బ్యారేజి, సమ్మక్క బ్యారేజిల నుండి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టినందున వరద నెమ్మదిగా తగ్గుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.

publive-image

ముంపుకు గురైన కొత్తకాలనీలోని 24 కుటుంబాలకు చెందిన 90 మందిని పునరావాస కేంద్రానికి తరలించినట్లు కలెక్టర్ వెల్లడించారు. ముంపునకు గురైనప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ యంత్రాంగపు సలహాలు, సూచనలు పాటిస్తూ రక్షణ చర్యలకు సహకరిస్తున్నారని చెప్పారు. పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చే వరకు ప్రజలు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని సూచించారు. వర్ష సూచనతో పాటు మొదటి ప్రమాద హెచ్చరిక అమల్లో ఉన్నదని... అధికార యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రియాంక అల సూచించారు.

వరద ఎక్కువగా ఉన్న నేపథ్ంలో ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు జల్లా కలెక్టర్. 24గంటలు పనిచేసేలా కలెక్టరేట్ తో పాటు కొత్తగూడెం, భద్రచాలం ఆర్డీవో కార్యాలయాలు, చర్ల దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపుం, పినకపాక ఎమ్మార్వో కార్యాలయాల్లో కంట్రోల్ రూములను ఏర్పాటు చేశారు. ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీచేవారు. పొంగిపొర్లుతున్న వాగులను దాటే ప్రయత్నం చేయోద్దని ప్రజలకు సూచించారు. అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని...అనవసరపు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు