Yanam's Pulasa Fish Record : 2కిలోల పులసకు వేలంపాట..ఎంతపలికిందో తెలుసా..?

చేపల పులుసు అంటే నచ్చని వారు ఉండరు. పులస కూర ఎప్పుడెప్పుడు రుచిచూడాలా అని మాంసాహార ప్రియులు ఎదురుచూస్తుంటారు.ఇంకా గోదావరి నదిలో దొరికే పులస చేప పేరు వింటే నోరూరడం ఖాయం.కేంద్ర పాలిత ప్రాంతమైన యానం వశిష్ట గోదావరిలో మత్స్యకారులకు పులస చేప చిక్కింది.రెండు కిలోల బరువుండే ఈ పులస చేప రూ.19వేల ధర పలికిందంటే ఈ చేపకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థమవుతోంది.

New Update
Yanam's Pulasa Fish Record : 2కిలోల పులసకు వేలంపాట..ఎంతపలికిందో తెలుసా..?

Yanam's Pulasa Fish Record: రుచిలో మేటిగా భావించే పులసంటే ఉభయ గోదావరి జిల్లాల వాసులకే కాదు.. ఇతర ప్రాంతాల వారికీ ఎంతో ఇష్టం. జీవితంలో ఒక్కసారి అయినా పులస చేప తినాలని మాంసాహార ప్రియులు కోరుకుంటారు. రెండు కిలోల పులస చేప కేంద్రపాలిత ప్రాంతమైన యానం వశిష్ట గోదావరిలో మత్స్యకారులకు చిక్కింది. కేవలం 2కిలోల పులస చేప రికార్డ్ ధర పలికింది. నాగలక్ష్మి అనే మత్యకార మహిళ రూ.19 వేలకు వేలం పాటలో దక్కించుకుంది.  రాజకీయ నాయకుడి కోసం రూ.26 వేలకు ఓ వ్యక్తి కొనుగోలు చేశాడని మత్స్యకారు మహిళ తెలిపింది. ఇటీవల కాలంలో పులస చేపలు చాలా అరుదుగా దొరకడంతో వీటి ధర ఆకాశాన్ని అంటుతోంది.

'పులస'తో 'పులుసు' అదుర్స్‌..
సముద్ర జలాలలో ఇలసగా ఉండే ఈ చేప ఎర్రమట్టి నీరు తాగడంతో ఇలస చేప కాస్త పులసగా మారుతుందని మత్స్యకారులు తెలుపుతున్నారు. యానం వద్ద గోదావరి పాయల్లో మత్స్యకారులు ఏర్పాటు చేసే ప్రత్యేక వలలలో ఈ చేపలు చిక్కుకుంటాయని..ఈ చేపల రుచి అమోఘంగా ఉండడంతో ధర కూడా భారీ స్థాయిలో పలుకుతుందని తెలిపారు. రెండు కిలోల బరువుండే చేప రూ.19వేల ధర పలికిందంటే ఈ చేపకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థమవుతోంది.మార్కెట్లకు ఎక్కువ చేపలు వస్తే ధర తక్కువగా..తక్కువ చేపలు వస్తే ధర ఎక్కువగా పలుకుతుంది. ఈ సీజన్లో రోజూ వేటకు వెళ్లే మత్స్యకారుల వలలకు ఒక్క పులస పడినా వారి పంట పండినట్టే.

పెళ్లాం పుస్తెలు అమ్మి అయినా సరే..

తూర్పుగోదావరి జిల్లాలోని మాంసాహార ప్రియులు ఏడాది కాలం పాటు ఎదురుచూసే రోజులు రానే వచ్చాయి. సాధారణంగా వరదలు అంటేనే గోదావరి పరివాహక ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతుంటారు. ముఖ్యంగా పులస చేప కోసం మాత్రమే మరింతగా ఎదురుచూస్తూ ఉంటారు.పెళ్లం పుస్తెలు అమ్మి అయినా సరే.. పులస కూర తినాలనేది గోదావరి జిల్లాల్లో దశాబ్దాల కాలంగా ఓ నానుడి.. అరుదుగా.. ఒకటీ రెండు లభించే ఈ జాతి చేపల కోసం మాంసాహార ప్రియులు వెంపర్లాడుతుంటారు.మత్స్యకారుల వద్ద పోటీపడి మరీ కొనుగోలు చేస్తుంటారు. ఇతర రాష్ట్రాల్లోని తమ బంధువులకు బహుమతిగా పంపుతుంటారు.

Also Read: మన్యంలో‌‌ టెన్షన్..ఆచూకీ దొరకని హరి అనే ఏనుగు!

Advertisment
తాజా కథనాలు