/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/maxwell-jpg.webp)
AFG vs AUS: 18.3 ఓవర్లు.. ఆస్ట్రేలియా స్కోరు 91/7.. క్రీజులో మ్యాక్స్‌వెల్, కమ్మిన్స్ ఉన్నారు. మరో 201 పరుగులు చేయాలి.. 31.2 ఓవర్లు ఉన్నాయి.. అఫ్ఘాన్ మరో సంచలనం సృష్టి్ండచం ఖాయమనే అనుకున్నారంతా.. ఐదుసార్లు వరల్డ్‌కప్ ఛాంపియన్ అయినా ఆస్ట్రేలియా అఫ్ఘాన్ చేతిలో ఓడిపోతుందని భావించారు.. కానీ మ్యాక్స్‌వెల్ అలా అనుకోలేదు.. పట్టువదలని పోరాట యోధుడిలాగా చివరి వరకు నిలబడ్డాడు. అవతలి ఎండ్‌లో కమ్మిన్స్‌ను జాగ్రత్తగా డాట్స్ ఆడమన్నాడు. మిగిలినదంతా తనే చూసుకుంటానన్నాడు. మధ్యలో గాయమైంది.. నడవలేని పరిస్థితి.. నొప్పికి విలవిలలాడిపోయాడు.. కుంటుతూనే పరుగులు చేశాడు. నొప్పి బాధను భరిస్తూనే సిక్సులు బాదాడు.. వీలు చిక్కినప్పుడల్లా ఫోర్లు కొట్టాడు. 292 టార్గెట్‌లో మ్యాక్స్‌వెల్ ఒక్కడే...201 కొట్టాడంటే మ్యాక్సీ ఎలా ఆడాడో ఊహించుకోవచ్చు.
On of the greatest innings one would ever see. Never Give Up.
Take a bow Glenn Maxwell . That was quite incredible #AUSvsAFG pic.twitter.com/THVzef8Dz8— VVS Laxman (@VVSLaxman281) November 7, 2023
జద్రాన్.. సూపర్ షో:
ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్ఘాన్ 50 ఓవర్లలో 291 పరుగులు చేసింది. అఫ్ఘాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ సెంచరీతో కదం తొక్కాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రెహ్మత్ షాతో కలిసి ఇబ్రహిం స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. ఇద్దరూ సింగిల్స్ రొటేట్ చేస్తూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఇదే సమయంలో బౌలింగ్‌కు వచ్చిన మ్యాక్స్‌వెల్ ఈ జోడిని వీడదీశాడు. 44 బంతుల్లో 30 రన్స్ చేసిన రెహ్మత్ షా మ్యాక్సి బౌలింగ్‌లో హెజిల్‌వుడ్‌కు చిక్కాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ షాహీది కూడా ఆచుతూచీ బ్యాటింగ్ చేయడంతో స్కోరు బోర్డు స్లోగా కదిలింది. 37.2 ఓవర్లలో జట్టు స్కోరు 173 వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ఓవైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో ఇబ్రహిం మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. మరోవైపు అజ్మతుల్లాతో పాటు రషీద్ ఖాన్ వేగంగా బ్యాటింగ్ చేయడంతో అఫ్ఘాన్ స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. ముఖ్యంగా రషీద్ ఖాన్ ఆస్ట్రేలియా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. బౌండరీలతో విరుచుకపడ్డాడు. కేవలం 18 బంతుల్లోనే 35 పరుగులు చేశాడు రషీద్‌ఖాన్. మరో ఎండ్‌లో ఇబ్రహీం జద్రాన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
Innings of a lifetime!! Hats off @Gmaxi_32 #AFGvsAUS
— Yuvraj Singh (@YUVSTRONG12) November 7, 2023
మ్యాక్స్‌వెల్ ఎవర్ గ్రీన్ బ్యాటింగ్:
292 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు స్టార్టింగ్‌లోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ హెడ్ డకౌట్ అయ్యాడు. నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో ఇక్రామ్‌కు చిక్కాడు. ఆ తర్వాత మిచెల్ మార్ష్ స్కోరు బోర్డును వేగంగా కదలించాడు. 11 బంతుల్లోనే 24 పరుగులు చేసిన మార్ష్‌ను నవీన్ ఉల్ హక్ LBW చేశాడు. ఆ తర్వాత కాసేపటికే వార్నర్ కూడా పెవిలియన్‌కు చేరుకున్నాడు. 29 బంతుల్లో 18 రన్స్ చేసిన వార్నర్‌ను అజ్మతుల్లా లేపేశాడు. వార్నర్ బౌల్డ్ అవ్వడంతో తర్వాత లబూషెన్ దిగాడు. అయితే లబూషెన్ చాలా స్లోగా ఆడాడు. 28 బంతుల్లో 14 పరుగులే చేసి ఔట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత జోష్ ఇంగ్లీస్ డకౌట్ అయ్యాడు. ఇక ఆస్ట్రేలియా 100లోపే ఆలౌట్ అవుతుందని అంతా భావించగా.. గ్లెన్ మ్యాక్స్‌వెల్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. 128 బంతుల్లోనే 201 పరుగులు చేసి ఆసీస్ ను గెలిపించాడు.
Also Read: టీవీలో సచిన్ ఆటను చూస్తూ పెరిగా.. విరాట్ కోహ్లీ ఎమోషనల్ కామెంట్స్..!