Crime News: విశాఖలో దారుణం.. పెళ్లి చేసుకోమన్న ప్రియురాలిని ప్రియుడు ఏం చేశాడంటే ? విశాఖలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి చేసుకోమన్నందుకు ప్రియురాలిపై ప్రియుడు విషప్రయోగం చేశాడు. వారం రోజులుగా ట్రీట్ మెంట్ తీసుకుంటూ రత్నమాధురి నేడు తెల్లవారుజామున మృతి చెందింది. ప్రియుడు శేఖర్ ఆమెను నమ్మించి చంపేశాడని యువతి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. By Jyoshna Sappogula 05 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Visakha: ఈ రోజుల్లో ప్రేమ వేరు, పెళ్లి వేరు అన్నట్లుగా ఉంది. ప్రేమించిన వాడు పెళ్లి చేసుకుంటాడన్న గ్యారెంటీ లేదు. తీరా పెళ్లి చేసుకోమని అడిగితే.. చంపడమో..చావడమో చేస్తారు. ఈలాంటి పలు సంఘటనలు చాలానే జరుగుతున్నాయి. తాజాగా, పెళ్లి చేసుకోమన్నందుకు ప్రియురాలిపై విషప్రయోగం చేశాడు ఓ ప్రియుడు. వారం రోజులుగా ట్రీట్ మెంట్ తీసుకుంటూ ఈ తెల్లవారుజామున యువతి మృతి చెందింది. ఈ దారుణమైన ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. Also Read: బాలసౌరీ ఒక బఫున్.. మేం ఎన్నికలకు సిద్ధం..కానీ… ! మృతురాలి బంధువులు చెబుతున్న ప్రకారం.. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న యువకుడు శేఖర్ యువతి రత్నమాధురి గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవలే ప్రియురాలు రత్నమాధురి పెళ్లి చేసుకోమని ప్రియుడు శేఖర్ ను ఒత్తిడి చేసింది. అయితే, శేఖర్ తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో ప్రియుడు కూడా అందుకు నిరాకరించాడు.ఈ నేపధ్యంలోనే రత్న మాధురి ఒత్తిడి తట్టుకోలేక.. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని అతను ఆమెను చంపేందుకు స్కెచ్ వేసినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరం చనిపోదామంటూ విశాఖలో ఓ హోటల్ కు ఆమెను తీసుకెళ్లాడు. Also Read: టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు..ఇన్ని ఇవాల్సిందే అంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్..! అక్కడ ప్రియురాలిపై విషం ప్రయోగం చేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ఆ తరువాత విషయం వెలుగులోకి రావడంతో ప్రియురాలు రత్నమాధురికి ఆస్పత్రిలో చికిత్స అందించారు. గత వారం రోజులుగా చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందింది. తన కూతురి చావుకు ప్రియుడు శేఖర్ కారణమంటూ బాధిత తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నమ్మించి చంపేశాడని యువతి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేపట్టారు. ప్రియుడు శేఖర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. #andhra-pradesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి