Mahabubabad: పెళ్ళైనా ఆగని ప్రియుడి వేధింపులు.. ప్రాణాలు తీసుకున్న ప్రియురాలు!

TG: మహబూబాబాద్ జిల్లాలో ప్రియుడి వేధింపులు తాళలేక యువతి సూసైడ్ చేసుకుంది. ఇది వరకే పెళ్ళైన సురేష్ అనూష అనే అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపాడు. పెళ్లి చేసుకునేందుకు నగదు తెమ్మని అనూషపై ఒత్తిడి తేగా ఆమె ఆ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది.

New Update
Mahabubabad: పెళ్ళైనా ఆగని ప్రియుడి వేధింపులు.. ప్రాణాలు తీసుకున్న ప్రియురాలు!

Mahabubabad Anusha Incident:మహబూబాబాద్ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రియుని వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ నోట్ రాసి ఉరేసుకుంది అనూష అనే యువతి. ప్రియుని ఇంటిముందు అమ్మాయి బంధువుల ధర్నా చేపట్టారు. మరిపెడ మండలం తానంచర్ల శివారు జెండాల తండాలో ఘటన చోటుచేసుకుంది. మృతికి ప్రియుడు భూక్యా సురేష్‌ కారణమని సూసైడ్‌ నోట్‌లో అనూష రాసి సూసైడ్ చేసుకుంది.

సురేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనూషను ట్రాప్ చేసి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు సురేష్‌. ఈ నేపథ్యంలో సురేష్ మొదటి భార్య పోలీసులను ఆశ్రయించింది. పెద్దల పంచాయితీలో 2 లక్షల జరిమానా కట్టి అనూషను వదలిపెడుతానని చెప్పాడు సురేష్. పంచాయితీ తర్వాత కూడా అనూషతో బంధం కొనసాగించాడు సురేష్. డబ్బులు, ఆస్తి తీసుకురా పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేశాడు. సురేష్ వేధింపులు పెరగడంతో అనూష ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు