Gill-Anderson: గిల్ తో జరిగిన మాటల యుద్ధం పై స్పందించిన జేమ్స్ అండర్సన్

చివరి టెస్ట్ లో గిల్ కు జేమ్స్ కు మధ్య జరిగిన మాటల యుద్ధం పై జేమ్స్ ఓ ఇంటర్వూలో స్పందించాడు. గిల్ నువ్వు భారత వెలుపల నువ్వేమైన పరుగులు చేశావా అని నేను అన్నా? దానికి బదులుగా గిల్ నువ్వు క్రికెట్ కు వీడ్కోలు పలకాలసిన సమయం వచ్చిందని అని అన్నాడని జేమ్స్ తెలిపాడు.

Gill-Anderson: గిల్ తో జరిగిన  మాటల యుద్ధం పై స్పందించిన జేమ్స్ అండర్సన్
New Update

Gill - Anderson Sledging: ధర్మశాల వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్ లో గిల్ తో జరిగిన మాటల యుద్ధం పై ఇంగ్లాడ్ పేసర్  జేమ్స్ అండర్సన్ తొలిసారి స్పందించారు. ఇటివలే ముగిసిన ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను (IND vs ENG) 4-1 తేడాతో టీమ్‌ఇండియా చిత్తు చేసింది. ధర్మశాల వేదికగా జరిగిన ఆఖరి టేస్ట్ మ్యాచ్ లో  ఇంగ్లాండ్ ఆటగాళ్ల తో  మన భారత యువ ఆటగాళ్లకు మధ్య జరిగిన మాటల యుద్ధం అందరికి గుర్తు ఉండే ఉంటుంది.  భారత యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill) - ఇంగ్లిష్‌ జట్టు సీనియర్ పేసర్ జేమ్స్‌ అండర్సన్ (James Anderson) మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. అయితే, అప్పుడు ఏం జరిగిందనేది గిల్ మ్యాచ్‌ అనంతరం చెప్పలేదు. తాజాగా ఇంగ్లాండ్‌ ఫాస్ట్‌ బౌలర్ అండర్సన్ అప్పుడేం జరిగిందో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

5 వ టేస్ట్ సిరీస్ లో  ఇంగ్లాండ్ ఆటగాళ్ల తో  మన కురాళ్లకు  జరిగిన మాటల యుద్ధం అందరికి గుర్తు ఉండే ఉంటుంది. గిల్-అండర్సన్ మధ్య జరగిన మాటల యుద్ధం పై జేమ్స్ ఓ ఇంటర్వూలో స్పందించారు. భారత్ లో కాకుండా బయట నువ్వేమైన పరుగులు చేశావా? అని నేను అన్నా. దానికి బదులుగా ఇక నువ్వు క్రికెట్ కు వీడ్కోలు ప్రకటించే సమయం వచ్చింది అని వ్యాఖ్యానించాడు. ఆ తర్వాత గిల్ నా బౌలింగ్ లో వెంటనే వెనుతిరిగాడు. అంతకముందే మరో ఎండ్ లో ఉన్న కులదీప్ యాదవ్‌ నేను కొద్ది సేపు సరదా సంభాషణ చేసుకున్నాము. కులదీప్ " నాదే నీకు మైలు రాయి వికెట్ అవుతుందని చెప్పాడు.మేమిద్దరం దానికి నవ్వుకున్నాం" అని అండర్సన్ గుర్తు చేశాడు. ఆ తర్వాత కులదీప్ యాదవ్ వికెట్ తీసుకుని అండర్సన్ 700వికెట్ మైలు రాయిని చేరుకున్నాడు. ఆ టెస్ట్ లో భారత విజయం సాధించడంలో శుభమన్ గిల్ కులదీప్ యాదవ్ కీలక పాత్ర పోషించారు. గిల్ సెంచరీతో అలరించగా..కుల్ దీప్ ఐదు వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. దీంతో భారత బ్యాటర్లు భారీగా పరుగులు చేసిన ఆ పిచ పై ఇంగ్లాడ్ ఆటగాళ్లు తేలిపోయారు.

Also Read: రాగి జావ తాగితే.. ఇలా జరుగుతుందా..! తెలిస్తే షాకవుతారు..!

#james-anderson #ind-vs-eng #shubman-gill
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe