/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-01T093858.362-jpg.webp)
Ginger, Garlic Rates : అల్లం(Ginger), వెల్లుల్లి(Garlic) ధరలు అమ్మబాబోయ్ అనిపిస్తున్నాయి. సామాన్యులు కొనలేని స్థాయికి వాటి రేట్లు పెరిగాయి. వెల్లుల్లి రేటు ఇంతకు ముందు కన్నా కాస్త తగ్గింది కానీ దానికితోడుగా అల్లం రేటు బాగా పెరిగింది. జనవరిలో కిలో అల్లం 90 ఉంటే వెల్లుల్లి 300రూ ఉండేది. కానీ ఇప్పుడు అల్లం కిలో 140- 180 రూ. ఉంటే... వెల్లుల్లి 240 -260 రూ. ఉంది. అదే హోల్‌సేల్(Wholesale) లో కొంటే మాత్రం అల్లం కిలో 90-100రూ ఉండగా... వెల్లుల్లి కిలో 120-180 ఉంటోంది. ఇక రెండు కలిపి కొంటే కిలో 250-280 రూ. వరకు అమ్ముతున్నారు.
ఇప్పటికే రెండు నెలలుగా వెల్లుల్లి ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇప్పుడు అల్లం కూడా అదే బాటలో ఉంది. ఇంకో 15, 20 రోజులు ఈ ధరలు ఇలాగే ఉంటాయని చెబుతున్నారు వ్యాపారస్తులు. అల్లం, వెల్లుల్లి దిగుబడి తగ్గిందని అందుకే ఇంత రేటు ఉంటున్నాయని అంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌కు అల్లం కేరళ, కర్నాటక నుంచి దిగుమతి అవుతోంది. అంతకు ముందు తెలంగాణ(Telangana) లోని జహీరాబాద్, కోహిర్ నుంచి వచ్చేది. ఇప్పుడు ఈ రెండు ప్రాంతాల నుంచి కేవలం ఒక్క టన్ను మాత్రమే అల్లం దిగుమతి అవుతోంది. దీంతో కేరళ నుంచి ఎక్కువగా తెప్పించుకోవాల్సి వస్తోంది. ఇక వెల్లుల్లి అయితే మధ్యప్రదేశ్, గుజరాత్ నుంచి ఎక్కువగా వస్తోంది. దీనికి కూడా బాగా డిమాండ్ ఉండడంతో అంతగా సరుకు రావడం లేదని వ్యాపారస్తులు చెబుతున్నారు.
కల్తీ సరుకు...
అల్లం, వెల్లుల్లుకి బాగా డిమాండ్ పెరగడంతో కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను అమ్మేస్తున్నారు మోసగాళ్ళు. ఇందులో ఏం కలుపుతున్నారో కూడా తెలియడం లేదు. తక్కువ ధరకే అల్లం, వెల్లుల్లి పేస్ట్ అని అమ్ముతుండడంతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ కల్తీ పేస్ట్ వల్ల అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
Also Read : JOBS: SSC CHSL తుది ఫలితాలు విడుదల..!