లోటస్‌పాండ్‌లో విజిలెన్స్ కమిషనర్ తనిఖీలు బఫర్ జోన్ లో నిర్మాణాలు చేపట్టినా, చెరువులను ఆక్రమించినా చర్యలు తప్పవని జీహెచ్ఎంసీ విజిలెన్స్ కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. నిన్న కమిషనర్ గా బాధత్యలు చేపట్టిన ఆయన.. ఆ మరుసటి రోజే లోటస్ పాండ్ లో తనిఖీలు చేపట్టడం చర్చనీయాంశమైంది. By Nikhil 27 Jun 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో నిర్మాణాలను విజిలెన్స్ కమిషనర్ రంగనాథ్ ఈ రోజు పరిశీలించారు. నిన్న జీహెచ్ఎంసీ విజిలెన్స్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన రంగనాథ్.. ఆ మరుసటి రోజే ఆకస్మిక తనిఖీలు చేపట్టడం చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా బఫర్ జోన్‌లో చేపట్టిన నిర్మాణాలపై రంగనాథ్ సీరియస్ అయ్యారు. చెరువుల ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల లోటస్‌పాండ్‌లోని మాజీ సీఎం జగన్ నివాసం ముందు సెక్యూరిటీ ఔట్ పోస్ట్ కూల్చివేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జోనల్ కమిషనర్‌పై చర్యలు తీసుకున్నారు. తాజాగా మరోసారి లోటస్‌పాండ్‌లో నిర్మాణాల పరిశీలన చేపట్టడం చర్చనీయాంశమైంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి