Ganesh Chaturthi 2024: దేశవ్యాప్తంగా మరో రెండు వారాల్లో గణపతి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. సెప్టెంబర్ 7న గణనాథుడు కొలువుతీరనున్నాడు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ పోలీస్ అధికారులు నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి కీలక సూచనలు చేశారు. విగ్రహ మండపాలతోపాటు నిమజ్జనం అయ్యే వరకు అనుమతులు తీసుకోవాల్సిందిగా సూచించారు. ఇందుకోసం ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సిటీ సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ప్రకటన విడుదల చేశారు. కాలనీలు, రోడ్లు, పబ్లిక్ ప్లేసుల్లో మండపాలకోసం ఏపీసీ పర్మిషన్ తప్పనిసరి అని స్పష్టం చేశారు.
పూర్తిగా చదవండి..Ganesh Chaturthi 2024: గణేశ్ మండప నిర్వాహకులకు పోలీసుల అలర్ట్.. ఇలా దరఖాస్తు చేసుకోండి!
జీహెచ్ఎంసీ పరిధిలోని గణేశ్ మండపాలు, నిమజ్జనానికి అనుమతి తప్పనిసరిగా ఉండాలని సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందుకోసం ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. www.hyderabadpolice.gov.in
Translate this News: