Ganesh Chaturthi 2024: గణేశ్ మండప నిర్వాహకులకు పోలీసుల అలర్ట్.. ఇలా దరఖాస్తు చేసుకోండి!

జీహెచ్ఎంసీ పరిధిలోని గణేశ్ మండపాలు, నిమజ్జనానికి అనుమతి తప్పనిసరిగా ఉండాలని సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందుకోసం ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్‌‌‌‌ 6 వరకు ఆన్‌‌లైన్‌‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. www.hyderabadpolice.gov.in

New Update
Ganesh Chaturthi 2024: గణేశ్ మండప నిర్వాహకులకు పోలీసుల అలర్ట్.. ఇలా దరఖాస్తు చేసుకోండి!

Ganesh Chaturthi 2024: దేశవ్యాప్తంగా మరో రెండు వారాల్లో గణపతి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. సెప్టెంబర్ 7న గణనాథుడు కొలువుతీరనున్నాడు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ పోలీస్ అధికారులు ​నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి కీలక సూచనలు చేశారు. విగ్రహ మండపాలతోపాటు నిమజ్జనం అయ్యే వరకు అనుమతులు తీసుకోవాల్సిందిగా సూచించారు. ఇందుకోసం ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్‌‌‌‌ 6 వరకు ఆన్‌‌లైన్‌‌లో దరఖాస్తులు‌ స్వీకరించనున్నట్లు సిటీ సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ప్రకటన విడుదల చేశారు. కాలనీలు, రోడ్లు, పబ్లిక్ ప్లేసుల్లో మండపాలకోసం ఏపీసీ పర్మిషన్ తప్పనిసరి అని స్పష్టం చేశారు.

ఎలా అప్లై చేసుకోవాలంటే..
మండపాలు, నిమజ్జనానికి సంబంధించిన వివరాలను సర్టిఫికెట్ రూపంలో పోలీస్ వెబ్‌‌సైట్‌ www.hyderabadpolice.gov.in,/ www .policeportal.tspolice.gov.in సాఫ్ట్ కాపీ అప్‌‌లోడ్‌‌ చేయాలి. మండపం ఏర్పాటు, నిమజ్జన ఊరేగింపు సమాచారం ఇవ్వాలి. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు మైత్రి మెంబర్స్‌‌ కో ఆర్డినేట్‌ చేసుకోవాలి. ఆన్‌‌లైన్‌‌ దరఖాస్తులో సమస్యలకు 8712665785 ఫోన్‌‌ నంబర్‌ను కాల్ చేయాలని పోలీసులు తెలిపారు.

వివాదాస్పద మండపాలకు నో క్లియరెన్స్‌..
ఇక ప్రభుత్వ, ప్రైవేట్‌‌ స్థలాల్లో మండపాలు ఏర్పాటు చేస్తే సంబంధిత వ్యక్తులు ఎన్‌‌ఓసీ తప్పనిసరి తీసుకోవాలి. ట్రాఫిక్‌‌కు అంతరాయం కలిగే ప్రాంతాల్లో మండపాలకు అనుమతి లేదు. ప్రైవేట్‌‌ రెసిడెన్స్‌‌లో ఏర్పాటు చేసుకునే మండపాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు. కాంప్లెక్స్‌‌లోని సెల్లార్స్‌‌లో మండపాలు ఏర్పాటు చేస్తే పోలీస్ క్లియరెన్స్ ఉండాలి. వివాదాస్పద మండపాలకు పోలీస్ లు క్లియరెన్స్‌‌ ఇవ్వరు. అనధికారిక ఎలక్ట్రిసిటీకి నో పర్మిషన్. టీజీఎస్‌‌పీడీసీఎల్‌‌, పోలీసులు ఇచ్చే పర్మిషన్‌‌ లెటర్‌‌‌‌ అప్లికేషన్‌‌తో అటాచ్‌‌ చేయాలి. లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల సమయంలో సౌండ్ బయటకు వినిపించకుండా మండపం వరకే పరిమితం చేయాలి. మండపాల వలంటీర్స్ కు ఐడీ కార్డులు, బ్యాడ్జిలుండాలి. హరతుల కారణంగా అగ్నిప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

Advertisment
తాజా కథనాలు