GHMC Finger Print Forgery scam: జీహెచ్‌ఎంసీలో నకిలీ వేలిముద్రల స్కాం.. ఇద్దరు అరెస్ట్..!

జీహెచ్‌ఎంసీ(GHMC)లో మరోసారి నకిలీ వేలిముద్రల స్కాం బయటపడింది. GHMC కాంట్రాక్ట్ ఉద్యోగులకు చెందిన 31 నకిలీ వేలిముద్రలను సూపర్‌వైజర్లు తయారుచేశారు . సూపర్వైజర్లు సాయినాథ్ , నాగరాజును ఈస్ట్ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ వేలిముద్రల ద్వారా ఆబ్‌సెంట్‌ అయిన ఉద్యోగుల పేరుతో డబ్బులు కాజేసినట్టు సమాచారం.

New Update
GHMC Finger Print Forgery scam: జీహెచ్‌ఎంసీలో నకిలీ వేలిముద్రల స్కాం.. ఇద్దరు అరెస్ట్..!

జీహెచ్‌ఎంసీ(GHMC)లో మరోసారి నకిలీ వేలిముద్రల స్కాం బయటపడింది. GHMC కాంట్రాక్ట్ ఉద్యోగులకు చెందిన 31 నకిలీ వేలిముద్రలను సూపర్‌వైజర్లు తయారుచేశారు . సూపర్వైజర్లు సాయినాథ్ , నాగరాజును ఈస్ట్ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ వేలిముద్రల ద్వారా ఆబ్‌సెంట్‌ అయిన ఉద్యోగుల పేరుతో డబ్బులు కాజేసినట్టు సమాచారం. ఈ ముగ్గురూ 31 మంది మహిళల సింథటిక్ వేలిముద్రలను సిద్ధం చేసి, వారు జీహెచ్‌ఎంసీ స్వీపర్‌లుగా పనిచేస్తున్నారని, బయోమెట్రిక్ యంత్రాల్లో వారి హాజరును గుర్తించినట్లు చూపించారు. "కొన్ని వేలల్లో వేతనాలు ముగ్గురూ కొంత కాల వ్యవధిలో క్లెయిమ్ చేశారు" అని టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. గతంలో కూడా జీహెచ్‌ఎంసీలో ఇదే పద్ధతిని అవలంబిస్తూ స్వీపర్లకు ఇస్తున్న వేతనాలను సైతం జేబులో వేసుకున్న వారిని పోలీసులు పట్టుకున్నారు.

గతంలోనూ ఇంతే:
ఈ ఏడాది జనవరిలోనూ ఇలానే జరిగింది. బయోమెట్రిక్ హాజరుతో మోసానికి పాల్పడిన జీహెచ్‌ఎంసీ సూపర్‌వైజర్‌, శానిటేషన్‌ కాంట్రాక్టర్‌ను టాస్క్‌ఫోర్స్‌ అధికారులు పట్టుకున్నారు. 24 బొటన వేలి ముద్రలు, ఒక బయోమెట్రిక్ హాజరు యంత్రం, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఖైరతాబాద్ సర్కిల్ XIIలో GHMC సూపర్‌వైజర్ ప్రభాకర్ , GHMC ఖైరతాబాద్ సర్కిల్ XIIలో పారిశుద్ధ్య కాంట్రాక్టర్ రాజేష్ మోసం చేసినందుకు వారిని అరెస్టు చేశారు.

గతేడాది జులైలోనూ ఇలానే పట్టుకున్నారు. నకిలీ వేలిముద్రల క్రియేషన్‌కి పాల్పడిన ముగ్గురు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఉద్యోగులను సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ అరెస్టు చేసింది. మద్ది వెంకట్ రెడ్డి, మస్కు లక్ష్మి నర్సింహ, కాశమోని వెంకటేష్‌లుగా గుర్తించారు. నిందితులందరూ బయోమెట్రిక్ యంత్రం ద్వారా పారిశుద్ధ్య కార్మికుల హాజరును గుర్తించేందుకు నకిలీ వేలిముద్రలు, బొటన వేలి ముద్రలు సృష్టించారు. నిందితుల నుంచి మూడు బయోమెట్రిక్ మిషన్లతో పాటు 43 నకిలీ వేలిముద్రలు, బొటన వేలి ముద్రలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఎం-సీల్‌, డెండ్రైట్‌ గ్లూ/ఫెవికాల్‌, వ్యాక్స్‌తో నకిలీ ముద్రలు సృష్టించినట్లు పోలీసులు తెలిపారు. వారు యూట్యూబ్ వీడియోల ద్వారా నకిలీ వేలిముద్రలను క్రియేట్ చేయడం నేర్చుకుంటారు.

ALSO READ: నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో ఫుడ్‌ పాయిజన్‌.. 40 మందికి అస్వస్థత

Advertisment
తాజా కథనాలు