/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/AP-Ex-CM-Jagan-1.jpg)
ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాల కూల్చివేతపై దుమారం రేగుతోంది. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ బొర్కడేపై ఉన్నతాధికారులు వేటు వేశారు. జగన్ ఇంటి ఎదుట నిర్మాణాల కూల్చివేతలపై బల్దియా కమిషనర్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. హేమంత్ బొర్కడేను జీఐడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఓ మంత్రి ఆదేశాలతోనే కూల్చివేతలు చేపట్టారంటూ బల్దియాలో ప్రచారం సాగుతోంది. హేమంత్ ను తొలగిస్తూ GHMC కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.