Vasthu Tips: ఇంట్లోకి రాగానే ఆందోళనగా అనిపిస్తుందా..? వాస్తు ఏం చెప్తుందో చూడండి ఇల్లు ప్రతీ ఒక్కరికి ప్రశాంతతను కలిగించే అందమైన ప్రదేశం. అయితే కొన్ని సందర్భాల్లో కొందరికి ఇంట్లోకి రాగానే భయం, ఆందోళను, కలుగుతాయి. దీనికి కారణం వాస్తు దోషమా.? అసలు దీని గురించి వాస్తుశాస్త్ర నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 28 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Vasthu Tips: సమాజంలో ప్రతీ ఒక్కరికి ప్రశాంతను కలిగించే అందమైన ప్రదేశం ఇల్లు. అందుకే అందరు ఇంటిని ఎంతో అందంగా, సరైన వాస్తు శాస్త్రాలతో శ్రద్దగా నిర్మించుకుంటారు. ఈ వాస్తు శాస్త్రాల వెనుక సైన్స్ కూడా ఉంటుంది. వాస్తు ఆచారాలు పాటించడం ఇంట్లో సానుకూలత, సంతోషకరమైన వాతావరణాన్ని కలిగిస్తాయి. ఇల్లు నిర్మించేటప్పుడు ప్రతీ గదిని వాస్తు ప్రకారం ప్లాన్ చేయడం సహజం. బెడ్ రూమ్ నైరుతి దిశలో, లివింగ్ రూమ్ తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్యంలో , వంట గది ఆగ్నేయ దిశలో నిర్మిస్తే సానుకూల ప్రభావాలు ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణుల చెడుతుంటారు. అందుకే ప్రతీ ఒక్కరికి ఎంతో ఇష్టమైన ప్రదేశం ఇల్లు. రోజంతా కష్టపడి ఇంటికి వెళ్ళగానే ఎంతో హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఇంట్లోకి రాగానే మనసులో తెలియని అలజడి, భయం, ఆందోళన, ఒత్తిడి వంటి భావనలు కలుగుతాయి. అసలు ఇంట్లోకి రాగానే ఇలా జరగడానికి కారణం ఏంటి..? వాస్తు దోషమా..? లేదంటే ఏదైనా ప్రతికూల శక్తుల ప్రభావమా..? కొన్ని సార్లు దీనికి కారణం వాస్తు దోషాలు కూడా కావచ్చు. ఇలాంటి విషయాల పై వాస్తు వాస్తు శాస్త్ర నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.. Also Read: Chicken Liver: చికెన్ లివర్ ఇష్టంగా తింటున్నారా.. అయితే ఇది చూడండి..! ఇంటి ప్రవేశ ద్వారం చీకటిగా సహజంగా ఇంట్లోకి రాగానే వెలుతురుగా కనిపిస్తే మంచి వైబ్ ఉంటుంది. ఆలా కాకుండా ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు చీకటిగా ఉండడం ఒక నెగటివ్ ఎనర్జీని కలిగిస్తుంది. దాని వల్ల వెంటనే ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని గాబరా, టెన్షన్ గా ఫీల్ అవుతాము. అంతే కాదు ఇంటి ఎంట్రెన్స్ గోడలు తడిగా, పగుళ్లతో ఉన్నప్పుడు కూడా ఇలాంటి భావన కలుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంటి మెట్ల నిర్మాణం ప్రతీ ఒక్కరి ఇంటి ముందు మొదటగా కనిపించేవి మెట్లు. అయితే తలుపులు తెరిచిన వెంటనే మెట్టు కనిపించడం ఒక రకమైన ప్రతికూల శక్తిని కలిగిస్తుంది. అందుకే ఇంటి మెట్లు ముఖ ద్వారం తెరిచిన వెంటనే కనిపించేలా కాకుండా నిర్మించాలి. దాంతో ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు వాటి పై ద్రుష్టి పడకుండా ఉంటుంది. సరైన మెట్ల స్థానం ఇంట్లో శాంతి, సామర్థ్యాన్ని కాపాడుతుంది. ఇంటి వాస్తు ప్రకారం మెట్లు నైరుతి దిశలో ఉంటే మంచి ప్రభావం ఉంటుంది. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Also Read: Round Wells: గుండ్రని బావులే ఎందుకు.. దీని వెనుక స్టోరీ ఇదే..! #vasthu-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి