Unwanted Hairs: అవాంఛిత రోమాలు ముఖ సౌందర్యాన్ని తగ్గిస్తుంది. దీని కారణంగా ముఖం లుక్ చెడుగా కనిపిస్తుంది. అవాంఛిత రోమాలను తొలగించడానికి కొందరూ పార్లకి వెళ్తారు. అంతేకాకుండా ఇంట్లో కొన్ని బ్యూటీ టిప్స్‌ని కూడా ఫాలో చేస్తారు. ఈ రోజుల్లో పెరుగుతున్న కాలుష్యం, సూర్యకాంతి కారణంగా ప్రతి ఒక్కరూ ముఖాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. అటువంటి సమయంలో ముఖ్యంగా అమ్మాయిలు ముఖంపై అవాంఛిత రోమాలు ఉంటాయి. ఇది సాధారణ సమస్య. దీంతో చాలా మంది ఆడపిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ అవాంఛిత రోమాలతో ఇబ్బంది పడుతుంటే.. ఈ వార్త మీకోసమే. ఈరోజు కొన్ని ఇంటి నివారణలు ఉన్నాయి. వాటి సహాయంతో అవాంఛిత రోమాలను వదిలించుకోవచ్చు.
తేనె, చక్కెర:
- అయితే అవాంఛిత రోమాలు తొలగించుకోవాలంటే తేనె, చక్కెరను ఉపయోగించవచ్చు. ఈ రెండు వస్తువులను ఉపయోగించి మీరు ఇంట్లో మైనపును సిద్ధం చేసుకోవచ్చు. దీన్ని చేయడానికి ముందుగా ఒక గిన్నెలో రెండు చెంచాల చక్కెర, ఒక చెంచా తేనె కలపాలి. తర్వాత ఈ పేస్ట్‌ను 30 సెకన్ల పాటు వేడి చేయాలి. ఇప్పుడు దీన్ని అవాంఛిత ఫేషియల్ హెయిర్‌పై అప్లై చేసి, వ్యాక్స్ స్ట్రిప్ సహాయంతో జుట్టును బయటకు తీయాలి.
గుడ్లు-మొక్కజొన్న పిండి:
- గుడ్లు, మొక్కజొన్న పిండిని కూడా ఉపయోగించవచ్చు. ముందుగా ఒక గిన్నెలో అర చెంచా మొక్కజొన్న పిండి, ఒక గుడ్డు తెల్లసొన కలపాలి. అందులో ఒక చెంచా చక్కెరను కూడా కల్పవచ్చు. ఈ పేస్ట్‌ను ఫేస్ లేయర్‌పై అప్లై చేసి ఆరనివ్వాలి. అది ఆరిన తర్వాత దానిని ఒక వైపు నుంచి వదలండి, స్ట్రిప్‌ను జుట్టుకు వ్యతిరేక దిశలో లాగాలి. ఇది అవాంఛిత రోమాలను తొలగిస్తుంది.
నిమ్మ, తేనె, చక్కెర:
- నిమ్మ, తేనె, చక్కెరను కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం ఒక చెంచా చక్కెరలో ఒక చెంచా తేనె, కొద్దిగా నిమ్మరసం కలపాలి. దానిలో రెండు-మూడు చెంచాల నీరు కాలపాలి. తరువాత తక్కువ మంటపై సిరప్‌గా మార్చవచ్చు. చల్లారిన తర్వాత ఈ పేస్ట్‌ని ముఖంపై అప్లై చేయాలి. దీని తర్వాత వాక్సింగ్ స్ట్రిప్ సహాయంతో లాగడం ద్వారా ముఖం నుంచి వెంట్రుకలను తొలగించవచ్చు.
వోట్స్- అరటిపండు:
- ఓట్స్, అరటిపండును ఉపయోగించడం ద్వారా అవాంఛిత రోమాలను తొలగించవచ్చు. దీని కోసం ఒక అరటిపండును తురుముకోవాలి, అందులో రెండు చెంచాల ఓట్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రెండు మూడు నిమిషాల పాటు అప్లై చేసి ఆపై 7 నుంచి 8 నిమిషాల పాటు ముఖాన్ని సర్క్యులర్ మోషన్‌లో మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల అవాంఛిత రోమాలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: గంటల తరబడి కూర్చుని పనిచేసే వారి కోసమే ఈ వార్త.. మరణాల ముప్పును కాఫీ తగ్గిస్తుందట!