Head Tips: చాలా మంది తలలో పేలు ఎక్కువగా ఉండటంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో తలలో పేను కొరుడు వంటి సమస్యలు కూడా ఏర్పడతాయి. ఎన్ని మందులు వాడినా, ఎంత జాగ్రత్తలు తీసుకున్నా పేళ్లు మాత్రం పోవు. కొన్ని ఇంటి నివారణ చిట్కాలతో పేలను సులభంగా తరిమికొట్టవచ్చు. జుట్టు ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. జుట్టులో పేను ఉండటం ఒక సాధారణ సమస్య. ఇది ముఖ్యంగా చిన్న పిల్లలలో ఎక్కువగా వస్తుంటుంది.
ఒకసారి వెంట్రుకల్లోకి పేలు వస్తే వాటిని తొలగించడం కొంచెం కష్టమే. పేలు చర్మంలో రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. దురద, మంటను కలిగిస్తుంది. అంతేకాకుండా జుట్టు కూడా పాడవుతుంది. జుట్టు రాలడానికి కూడా కారణమవుతుంది. కొంతమంది పిల్లలలో పేలు ఎక్కువగా ఉండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. పేలను వదిలించుకోవడానికి నిమ్మరసం ఉపయోగించవచ్చు. దీని కోసం రెండు పెద్ద నిమ్మకాయల రసాన్ని ఒక చెంచా నీటిలో కలపాలి. దాన్ని జుట్టుకు రాయాలి. మిశ్రమాన్ని అప్లై చేసిన 30 నిమిషాల తర్వాత షాంపూతో జుట్టును కడగాలి. ఇలా వారానికి రెండు మూడుసార్లు చేస్తే ఉపశమనం లభిస్తుంది.
అంతేకాకుండా పేలను చంపడంలో కొబ్బరి నూనె బాగా ఉపయోగపడుతుంది. రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెను జుట్టుకు పట్టించి ఉదయం నిద్రలేచిన తర్వాత జుట్టును దువ్వి ఆ తర్వాత కడగాలి. ఇలా వారానికి 2 నుంచి 3 సార్లు చేయాలి. 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలను గ్రైండ్ చేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను జుట్టుకు అప్లై చేసి 30 నిమిషాల తర్వాత జుట్టును కడగాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే ఉపయోగం ఉంటుంది. కప్పు మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం నీటిని ఫిల్టర్ చేసి ఈ నీటితో జుట్టును కడగాలి. ఇలా చేయడం వల్ల పేలు పోతాయి. కప్పు నీటిలో కప్పు వైట్ వెనిగర్ కలపాలి ఈ పేస్ట్‌ను జుట్టుపై అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత షాంపూతో జుట్టును కడగాలి. ఇలా చేస్తే పేలు సులభంగా పోతాయి.
ఇది కూడా చదవండి: నోట్లో ఈ సమస్యలు ఉంటే అది విటమిన్ లోపమే
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.