G20 Summit: కంటికి ఐ ప్యాచ్ తో జర్మనీ ఛాన్సలర్!

జర్మనీ ఛాన్సలర్‌ కంటికి ఐ ప్యాచ్‌ ధరించి ఈ సమావేశాలకు హాజరు అయ్యారు. కంటికి సంబంధించి ఏదైనా సర్జరీ చేసుకున్న వారు మాత్రమే అలా కంటికి ఐ ప్యాచ్‌ ధరిస్తారు.

G20 Summit: కంటికి ఐ ప్యాచ్ తో జర్మనీ ఛాన్సలర్!
New Update

జీ 20 సమావేశాలు ఢిల్లీ నగరంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకకు దేశ విదేశాల నుంచి అతిథులు తరలి వచ్చారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, బ్రిటన్‌ అధ్యక్షుడు , భారత్‌ అల్లుడు రిషి సునాక్‌ లతో పాటు ఇతర దేశాల నాయకులదరూ ఢిల్లీ వేదికగా కలుసుకున్నారు.

ఈ క్రమంలో వారికి భారత ప్రధాని నరేంద్ర మోడీ వారికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్‌ స్కల్జ్‌ కూడా హాజరయ్యారు. ఆయనకు భారత ప్రధాని మోడీ భారత మండపంలో ఉన్న కోణార్క్‌ వీల్‌ వద్ద ఆయనకు స్వాగతం పలికారు. అయితే జర్మనీ ఛాన్సలర్‌ కంటికి ఐ ప్యాచ్‌ ధరించి ఈ సమావేశాలకు హాజరు అయ్యారు.

కంటికి సంబంధించి ఏదైనా సర్జరీ చేసుకున్న వారు మాత్రమే అలా కంటికి ఐ ప్యాచ్‌ ధరిస్తారు. శనివారం జర్మనీ ఛాన్సలర్ కూడా ఐ ప్యాచ్ తో కనపడడంతో అక్కడ ఉన్న వారు ఏంటా అని ఆరా తీశారు. దీని గురించి జర్మనీ ప్రభుత్వం ఓ క్లారిటీ ఇచ్చింది.

జర్మనీ ఛాన్సలర్ స్కల్జ్‌ 65 ఏళ్ల వయసు వారు. ఆయన గత వారం జాగింగ్‌ చేస్తున్న సమయంలో అనుకొని ప్రమాదానికి గురి అయ్యారు. ఈ క్రమంలోనే ఆయన కుడి కన్నుకు స్వల్పంగా గాయమైంది. అయితే ఆయన కంటికి గాయాల కారణంగా కొన్ని రోజుల పాటు ఐ ప్యాచ్‌ ధరించాల్సి ఉంటుందని ఆ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు.

#g20-summit #modi #germon-chancellor
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి