/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/MODI-3-jpg.webp)
General Elections 2024: దేశవ్యాప్తంగా 4వ విడత ఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభం అయింది. ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయాన్నే బారులు తీరారు. ప్రముఖ నేతలు.. సెలబ్రిటీలు ఒక్కరొక్కరుగా తమ ఓటును వేసేందుకు వస్తున్నారు. మరోవైపు ఎన్నికల్లో ఓటు హక్కు తప్పకుండా వినియోగించుకోవాలని కోరుతూ నేతలు ప్రజలకు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఏపీ ప్రజలకు ప్రత్యేకంగా x వేదికగా విజ్ఞప్తి చేశారు. “ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు,ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసేవారు, రికార్డు స్థాయిలో అసెంబ్లీ ఎన్నికలలో ఓటు వేయాలని కోరుతున్నాను. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత పెంచుతాయని ఆశిస్తున్నాను .” అంటూ ట్వీట్ చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు,ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసేవారు, రికార్డు స్థాయిలో అసెంబ్లీ ఎన్నికలలో ఓటు వేయాలని కోరుతున్నాను.
ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత పెంచుతాయని ఆశిస్తున్నాను .— Narendra Modi (@narendramodi) May 13, 2024
General Elections 2024: ఇక మరో ట్వీట్ లో ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా నాలుగో విడత పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల ఓటర్లకు ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కోరారు.
అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటు వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. “లోక్‌సభ ఎన్నికల్లో నాలుగో దశలో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. ఈ స్థానాలన్నింటిలో ప్రజలు అధిక సంఖ్యలో ఓటు వేస్తారని, ఇందులో యువత -మహిళా ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటారని నేను విశ్వసిస్తున్నాను. మన కర్తవ్యాన్ని నిర్వర్తించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం.” అంటూ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.