GDP Statistics : ఊహించిన దానికంటే ఎక్కువగా.. జీడీపీ వృద్ధి.. ఎంతంటే.. 

జీడీపీ వృద్ధి ఆర్బీఐ గత అంచనాల కంటే ఎక్కువగా ఉంది. 2023-2024 ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ ఎక్కువ వృద్ధి కనిపించింది. స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధి 8.4%కి పెరిగింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) ఈ గణాంకాలను విడుదల చేసింది

New Update
GDP Statistics : ఊహించిన దానికంటే ఎక్కువగా.. జీడీపీ వృద్ధి.. ఎంతంటే.. 

GDP Statistics : మన దేశ జీడీపీ వృద్ధి ఊహించిన దానికంటే ఎక్కువగా నమోదు అయింది. 2023-2024 ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధి 8.4%కి పెరిగింది. తయారీ-మైనింగ్ రంగాల మెరుగైన పనితీరు కారణంగా GDP Statistics లో ఈ పెరుగుదల కనిపించింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) ఈ గణాంకాలను విడుదల చేసింది. గత త్రైమాసికంలో జిడిపి 7.6 శాతంగా ఉంది. బలమైన పట్టణ వినియోగం, తయారీ - అధిక ప్రభుత్వ వ్యయం కారణంగా ఊహించిన దాని కంటే అధిక వృద్ధి కనిపించింది.  ఒక సంవత్సరం క్రితం, అంటే 2022-23 మూడవ త్రైమాసికంలో, GDP కేవలం 4.5% మాత్రమే పెరిగింది. జిడిపి వృద్ధి(GDP Statistics) ఆర్‌బిఐ అంచనా కంటే మెరుగ్గా ఉండడం గమనార్హం. మూడో త్రైమాసికంలో జిడిపి వృద్ధిరేటు 6.5 శాతంగా ఉంటుందని ఆర్‌బిఐ అంచనా వేసింది. కానీ, వాస్తవానికి అది బాగా పెరిగింది. 

తయారీ రంగం వృద్ధి 11.6 శాతానికి పెరిగింది

  • మైనింగ్ వృద్ధి -1.4% నుండి 7.5% YYకి పెరిగింది.
  • వార్షిక ప్రాతిపదికన తయారీ రంగం వృద్ధి -4.8% నుండి 11.6%కి పెరిగింది.
  • నిర్మాణ వృద్ధి వార్షిక ప్రాతిపదికన 9.5% వద్ద ఎటువంటి మార్పు లేకుండా ఉంది.

GVA 6.5%కి చేరింది..
వార్షిక ప్రాతిపదికన, స్థూల విలువ జోడింపు అంటే GVA 4.8% నుండి 6.5%కి పెరిగింది. ఇది కాకుండా, ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు GVA వృద్ధి వార్షిక ప్రాతిపదికన 6.9% నుండి 7.5%కి పెరిగింది.

గత త్రైమాసికంలో జివిఎ 7.4%
రెండవ త్రైమాసికంలో GVA 7.4%గా ఉంది. అప్పుడు ఇది 6.8%గా ఉండొచ్చని అంచనా వేశారు. కానీ ఎక్కువగా నమోదు అయింది. మొదటి త్రైమాసికంలో జివిఎ 7.8%గా ఉంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వృద్ధి రేటు 5.4 శాతంగా ఉంది.

ఆర్థిక లోటు: ₹ 8.04 లక్షల కోట్లు..
మరోవైపు, ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు, బడ్జెట్‌లో ద్రవ్య లోటు ₹ 8.04 లక్షల కోట్లకు పెరిగింది. ఇది బడ్జెట్ అంచనాలో 45%. ఆర్థిక లోటు లక్ష్యం రూ.17.86 లక్షల కోట్లు. గత ఏడాది ఇదే కాలంలో ద్రవ్యలోటు 2022-23 బడ్జెట్ అంచనాలో 45.6%. ప్రభుత్వం తన ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేస్తే దాన్ని ద్రవ్యలోటు అంటారు.

2024 ఆర్థిక సంవత్సరంలో GDP వృద్ధి 6.4%గా అంచనా..
ఇటీవల, S&P గ్లోబల్ రేటింగ్స్ GDP(GDP Statistics) అంచనాలను విడుదల చేసింది. S&P 2024 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధి అంచనాను 6.4%కి పెంచింది. అంతకుముందు ఇది 6%గా అంచనా వేశారు. బలమైన దేశీయ జోరు ఈ అంచనాలు పెంచడానికి  కారణమని S&P పేర్కొంది.

Also Read: మార్చిలో బ్యాంకులకు 14 రోజుల పాటు సెలవులు.. అలర్ట్‌!

GDP అంటే ఏమిటి?
ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యాన్ని ట్రాక్ చేయడానికి ఉపయోగించే అత్యంత సాధారణ సూచికలలో GDP ఒకటి. GDP అనేది ఒక నిర్దిష్ట సమయంలో దేశంలో ఉత్పత్తి చేయబడిన అన్ని వస్తువులు - సేవల విలువను సూచిస్తుంది. దేశ సరిహద్దుల్లో ఉత్పత్తి చేసే విదేశీ కంపెనీలను కూడా ఇందులో చేర్చారు.

GDPలో రెండు రకాలు ఉన్నాయి
జీడీపీ(GDP Statistics) రెండు రకాలు. వాస్తవ GDP - నామమాత్ర GDP. వాస్తవ GDPలో, వస్తువులు, సేవల విలువ ఆధార సంవత్సరం విలువ లేదా స్థిరమైన ధరలో లెక్కిస్తారు. ప్రస్తుతం GDP ని గణించడానికి ఆధార సంవత్సరం 2011-12. నామమాత్రపు GDP ప్రస్తుత ధర వద్ద లెక్కించడం జరుగుతుంది. 

GDP ఎలా లెక్కిస్తారు?
GDPని లెక్కించడానికి ఒక ఫార్ములా ఉంటుంది. GDP=C+G+I+NX, ఇక్కడ C అంటే ప్రైవేట్ వినియోగం, G అంటే ప్రభుత్వ వ్యయం, I అంటే పెట్టుబడి అలాగే NX అంటే నికర ఎగుమతి.

Advertisment
Advertisment
తాజా కథనాలు