BREAKING: తెలంగాణలో మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్

తెలంగాణలో మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది గవర్నర్ కార్యాలయం. ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ తమిళిసైకు ఇచ్చారు వికాస్ రాజ్. తెలంగాణ రెండో శాసనసభ రద్దయింది. మంత్రి మండలి ప్రతిపాదనతో రద్దుకు గవర్నర్ ఆమోదం తెలిపారు.

New Update
BREAKING: తెలంగాణలో మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్

తెలంగాణలో మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది గవర్నర్ కార్యాలయం. ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ తమిళిసైకు ఇచ్చారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్. తెలంగాణ రెండో శాసనసభ రద్దయింది.మంత్రి మండలి ప్రతిపాదనతో రద్దుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది.

అయితే, నిన్న (ఆదివారం) ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని తెలిపేందుకు రాజ్ భవన్ కు వెళ్లారు కాంగ్రెస్ నేతలు. గవర్నర్ తమిళిసైతో సమావేశం అయ్యారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు రవి తదితర ముఖ్యనేతలు గవర్నర్ తమిళిసైతో భేటీ అయ్యారు. ఈ భేటీ ఎన్నికల కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ తరువాతే కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆమోదం తెలుపుతానని గవర్నర్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఈరోజు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ గవర్నర్ తమిళిసై ను కలిసి గెలిచిన ఎమ్మెల్యేల జాబితాను అందించారు. అయితే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 65 సీట్లను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు