గాజాలో ఓ ఆసుపత్రి డాక్టర్ ఆవేదన.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు..! గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి ఆల్ షిఫా మూతపడింది. విద్యుత్ లేకపోవడంతో ఇంక్యుబేటర్లు పనిచేయని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో, అప్పుడే పుట్టిన పసికందులు, రోగులు ప్రాణాలు కోల్పోతున్నారని గాజాలో ఓ ఆసుపత్రి డాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 14 Nov 2023 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Gaza’s biggest hospital: గాజాలోని ఓ డాక్టర్ సోషల్ మీడియాలో పెట్టిన వీడియోను చూస్తుంటే మనసుని కలచివేస్తోంది. ఆ వీడియోలో ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో గాజాలో అప్పుడే పుట్టిన పసికందులు, రోగులు అక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆ వీడియో చూస్తుంటే అర్థమవుతోంది. గాజాలోని అతిపెద్ద ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేని పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు మందులకు తీవ్ర కొరతతో ఇబ్బంది పడుతుంటే, తాజాగా ఇంధనంలేక విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. దీంతో ఆసుపత్రి మూతపడిందని ఆల్ షిఫా డైరెక్టర్ ప్రకటించారు. అందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. As conditions continue to deteriorate at major hospitals across Gaza, a Palestinian official says three premature babies have now died at Gaza’s biggest hospital, al-Shifa, because there is no power for incubators. pic.twitter.com/zkC8azcfhg — Channel 4 News (@Channel4News) November 13, 2023 గాజాలో పెద్దలే కాదు అప్పుడే పుట్టిన పసికందులకు కూడా తిప్పలు తప్పడం లేదు. ఆసుపత్రిలో రోగులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అభం శుభం తెలియని ఆ పసికందులు ప్రాణాలు కోల్పోతున్నారు. నెలలు నిండక ముందే భూమ్మీద పడిన పాపాయిలను ఇంక్యుబేటర్లో ఉంచాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అయితే, విద్యుత్ లేకపోవడంతో ఇంక్యుబేటర్లు పనిచేయని పరిస్థితి. దీంతో, ఈ పనికందుల ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో తెలియక ఆసుపత్రి సిబ్బంది ఆయోమయంలో పడ్డారు. ఇక చేసేదేమి లేక పసికందులను వెచ్చదనం కోసం ఒకేచోట పక్కపక్కనే పడుకోబెట్టినట్లు తెలుస్తోంది. ఆ వీడియోలో డాక్టర్ మాట్లాడుతూ.. ఆదివారం తమ ఆసుపత్రిలో 39 మంది పసికందులు ఉండగా.. సాయంత్రానికి ముగ్గురు చనిపోయారని చెప్పారు. సోమవారం 36 మంది ఉన్నారని, వీరిలో రేపు ఎంతమంది మిగులుతారోనని ఆవేదన వ్యక్తం చేశారు. మరో ఆసుపత్రిలో బెడ్ చుట్టూ ఫాయిల్ చుట్టి అందులో పసికందులను పడుకోబెడుతున్నట్లు వైద్యులు చెప్పారు. ఆ బెడ్ పక్కనే వేడి నీళ్ల పాత్రలు పెట్టి వారికి వెచ్చదనం లభించేలా చూస్తున్నామని తెలిపారు. #hamas-israel-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి