Kohli Vs Gambhir: 'అది నా హక్కు...' కోహ్లీతో గొడవ..! గంభీర్‌ అసలు తగ్గట్లేదుగా!

ఓ మెంటార్‌గా తన ముందు తన ఆటగాళ్లతో ఎవరూ కూడా వాగ్వాదానికి దిగవద్దంటూ కామెంట్స్ చేశాడు గంభీర్‌. ఐపీఎల్‌లో కోహ్లీతో గొడవ గురించి ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఎవరైనా ఇప్పటికీ నా ఆటగాళ్లతో తీవ్ర వాగ్వాదానికి దిగితే, వారిని సమర్థించుకోవడం నా రైట్' అని చెప్పాడు.

New Update
Kohli Vs Gambhir: 'అది నా హక్కు...' కోహ్లీతో గొడవ..! గంభీర్‌ అసలు తగ్గట్లేదుగా!

ఈ ఏడాది(2023)ఐపీఎల్‌లో గంభీర్‌((Gambhir) వర్సెస్‌ కోహ్లీ(Kohli) గొడవ టాక్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌గా నిలిచింది. అప్పటివరకు చప్పగా సాగిన టోర్నికి కొత్త ఊపునిచ్చింది. 2011 వరల్డ్‌కప్‌ హీరోలైన ఈ ఇద్దరు మైదానంలో నేరుగా కొట్లాడుకోవడం అదేం తొలిసారి కాదు. 2013లోనూ ఓ సారి ఇద్దరూ గ్రౌండ్‌లో కొట్టుకునే వరకు వెళ్లారు. రజత్‌ భాటియా ఇద్దరి మధ్య రాకపోతే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు. ఈ ఏడాది లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లోనూ దాదాపు కొట్టుకుంటారేమో అనిపించింది. ఇటు గంభీర్‌ చాలా సందర్భాల్లో కోహ్లీని విమర్శిస్తూ వస్తున్నాడు. ఛాన్స్‌ దొరికనిప్పుడల్లా క్రిటిసైజ్ చేయడం గంభీర్‌కు అలవాటు. అందుకే కోహ్లీ ఫ్యాన్స్‌ ఎప్పుడూ గంభీర్‌పై ఫైర్ అవుతుంటారు. ఇక తాజాగా గంభీర్‌ మరోసారి కోహ్లీతో గొడవపై కామెంట్స్ చేశాడు.

గంభీర్‌ ఏం అన్నాడంటే?
లోక్నో వేదికగా కోహ్లీతో జరిగిన గొడవపై గంభీర్‌ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఒక మెంటార్‌గా ఎవరూ వచ్చి నా ఆటగాళ్లతో. నాకు చాలా భిన్నమైన నమ్మకం ఉంది. ఆట ప్రారంభమయ్యే వరకు, జోక్యం చేసుకునే హక్కు నాకు లేదు. ఆట ముగిసిన తర్వాత, ఎవరైనా ఇప్పటికీ నా ఆటగాళ్లతో తీవ్ర వాగ్వాదానికి దిగితే, వారిని సమర్థించుకోవడం నా రైట్' అని గంభీర్ కుండబద్దలు కొట్టాడు.

అసలేం జరిగిందంటే..?
అప్పటివరకు ప్రశాంతంగా సాగిపోతున్న ఐపీఎల్ 2023 సీజన్‌లో మే2న జరిగిన లక్నో వర్సెస్‌ ఆర్సీబీ మ్యాచ్‌ ఒక్కసారిగా అగ్గి రేగింది. క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఊహించిన మసాలా కూడా యాడ్ అయ్యింది. మ్యాచ్ తర్వాత మినీ రణరంగమే జరడాన్ని కాక రేపింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఆర్‌సీబీ 126 పరుగులే చేసినా లక్ష్యఛేదనలో లక్నో 77 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. అయితే నవీన్ వుల్ హక్, అమిత్ మిశ్రా కలిసి కాసేపు వికెట్లకు అడ్డుగా నిలిచి, రెండేసి బౌండరీలు బాదారు. ఈ సమయంలో నవీన్ వుల్ హక్‌‌ని విరాట్ కోహ్లీ స్లెడ్జ్ చేశాడు. ఆ తర్వాత అతను అవుట్ అవ్వగానే అతిగా సెలబ్రేట్ చేసుకున్నాడు. దానికి నవీన్ వుల్ హక్ రియాక్ట్ కావడంతో గొడవ మొదలైంది. నవీన్ వుల్‌ హక్‌కి బూటు కాలు చూపిస్తూ కోహ్లీ ప్రవర్తించిన తీరు అతనికి బాగా కోపం తెప్పించింది. గ్రౌండ్‌తో నవీన్‌ వర్సెస్‌ కోహ్లీ ఫైట్ మ్యాచ్‌ ముగిసిన తర్వాత కూడా కంటిన్యూ అయ్యింది. ఇరు జట్టు ఆటగాళ్లు షేక్‌ హ్యాండ్స్‌ ఇచ్చుకునే సమయంలో నవీన్‌, కోహ్లీ మరోసారి గొడవ పడ్డారు. వెంటనే గంభీర్‌ ఎంట్రీ ఇచ్చాడు. మాటామాటా పెరిగింది. అది కాస్త పెద్దదైంది

Also Read: ఆక్షనీర్ గా ఆకర్షిస్తున్న మల్లికా సాగర్..నెట్లో తెగ సెర్చ్ చేస్తున్న జనాలు

WATCH:

Advertisment
తాజా కథనాలు