/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/adani-jpg.webp)
హిండెన్ బర్గ్ సంస్థ...తనప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తుందంటూ అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ ఆదానీ ఆరోపించారు. అదానీ గ్రూప్ ఎల్లప్పుడూ తన పెట్టుబడిదారులకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. తాజాగా గ్రూప్ 31వ వార్షిక సర్వసభ్య సమావేశంలో అదానీ గ్రూప్ ఏజీఎంలో గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ మాట్లాడుతూ.. హిండెన్‌బర్గ్ వివాదం గ్రూప్ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నమని అన్నారు. ఈ నివేదిక తప్పుడు సమాచారం ఆధారంగా రూపొందించారని.., దర్యాప్తు కోసం ఏర్పాటైన కమిటీ ఎలాంటి నియంత్రణ వైఫల్యాన్ని గుర్తించలేదన్నారు. కంపెనీల షేర్ల ధరలను తగ్గించి లాభాలు ఆర్జించడమే హిండెన్‌బర్గ్ నివేదిక లక్ష్యమని అదానీ ఆరోపించారు.
హిండెన్ బర్గ్ రీసెర్చ్ తప్పుడు ఆరోపణలను తోసిపుచ్చారు. వాటాదారులకు స్థిరమైన వ్రుద్ధి, విలువ స్రుష్టికి హామీ ఇచ్చారు. ప్రపంచస్తాయి ఆస్తులను నిర్మించేందుకు గ్రూప్ కట్టుబడి ఉందని అదానీ చెప్పారు. అదానీ గ్రూపులో అకౌంటింగ్ మోసం, స్టాక్ ప్రైస్ మానిప్యులేషన్ జరిగిందని హిండెన్ బర్గ్ రీసెర్చ్ తన రిపోర్టులో ఆరోపణలు చేసింది. దీంతో అదానీ గ్రూపు స్టాక్ లు భారీ పతానికి దారి తీసాయి. ఫలితంగా గ్రూపు మార్కెట్ విలువను భారీగా కోల్పోయింది. హిండెన్ బర్గ్ ఆరోపణలపై అదానీ గ్రూపు స్టాక్స్ పెరిగిన తర్వాత రెగ్యులేటరీ మెకానిజమ్స్ వైఫల్యాన్ని సూచించే ఆధారాలు తమకు లభించలేదని 6గురు సభ్యుల సుప్రీంకోర్టు ప్యానెల్ పేర్కొన్నది.