Ganta Srinivasa Rao: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా అరెస్ట్

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన కుమారుడు గంటాను కూడా అరెస్ట్ చేశారు సీఐడీ పోలీసులు. టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలోనే గంటాను కూడా అదుపులోకి తీసుకున్నారు. గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా గంటా శ్రీనివాసరావు పనిచేశారు.

New Update
Ganta Srinivasa Rao: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా అరెస్ట్

Ganta Srinivasa Rao: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన కుమారుడు గంటాను కూడా అరెస్ట్ చేశారు సీఐడీ పోలీసులు. టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలోనే గంటాను కూడా అదుపులోకి తీసుకున్నారు. గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా గంటా శ్రీనివాసరావు పనిచేశారు. గతం సీఐడీ నమోదు చేసిన కేసుల్లో ఎక్కడా గంటా పేరు రాలేదు. అయితే అనూహ్యంగా గంటాను కూడా అరెస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. ఎండాడలోని దిశ పోలీస్‌స్టేషన్‌లో ఆయనను ఉంచారు.

సుప్రీం సీనియర్ లాయర్ సిద్ధార్థ లూథ్రా వాదనలు..

మరోవైపు ఇదే కేసులో అరెస్టైన చంద్రబాబును సీఐడీ అధికారులు కాసేపట్లో ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నారు. దీంతో విజయవాడ సిటీ కాంప్లెక్స్ వద్ద టీడీపీ శ్రేణులు భారీగా చేరుకుని ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు అక్కడకు భారీగా చేరుకుని వారిని చెదరగొట్టారు. చంద్రబాబు తరఫున కోర్టులో వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ లూథ్రా రంగంలోకి దిగారు. లూథ్రా తన బృందంతో ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.

మరోవైపు చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి తన సోదరుడు నందమూరి రామకృష్ణతో కలిసి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఒక బిడ్డగా మనసు బాగలేకపోతే తల్లిదండ్రులకు వెళ్తారని.. అందుకే తాను అమ్మవారిని దర్శించుకున్నానని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. మా ఆయన చంద్రబాబును రక్షించమని ఆయనకు మనోధైర్యం ఇవ్వాలని తాను కోరుకున్నట్లు వెల్లడించారు. చంద్రబాబు పోరాటం ఆయన ఒక్కరి కోసమో, ఆయన కుటుంబం కోసమో కాదని.. ఆయన పోరాటం ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వేచ్ఛ కోసం, హక్కుల కోసమన్నారు. మీ అందరి కోసం చంద్రబాబు చేస్తున్న పోరాటం దిగ్విజయం కావడానికి అందరూ చేయిచేయి కలపాలని ఆమె పిలుపునిచ్చారు.

చంద్రబాబు బావ, బాలకృష్ణ సోదరుడు నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. 2021లో ఉన్న కేసును తీసుకొచ్చి ఇప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేయడం చాలా అన్యాయమని వాపోయారు. విభజన తర్వాత చంద్రబాబు హయాంలో తొలి స్థానంలో ఉన్న ఏపీని జగన్ ప్రభుత్వం అడుక్కునే స్థాయికి దిగజార్చిందని విమర్శించారు. రాష్ట్రాన్ని వదిలేసి ముఖ్యమంత్రి జగన్ విదేశాలు తిరుగుతున్నారని ఇలాంటి సీఎం ఉండటం మన దౌర్భాగ్యమని విమర్శించారు. చంద్రబాబును మళ్లీ సీఎం చేయాలని ప్రజలను ఆయన కోరారు.

ఇది కూడా చదవండి: లోకేష్ పాత్రపైనా విచారణ జరుపుతాం: సీఐడీ చీఫ్‌

Advertisment
Advertisment
తాజా కథనాలు