Ganta Srinivas: రావద్దు జగన్.. మాకొద్దు జగన్ : మాజీ మంత్రి గంటా

ఎన్నికల్లో మీరు గెలిచేది లేదు.. ప్రమాణ స్వీకారానికి విశాఖకి వచ్చేది లేదని సీఎం జగన్ కు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కౌంటర్ వేశారు. 'సిటీ ఆఫ్ డెస్టినీ'గా ఉన్న విశాఖ‌ను 'సిటీ ఆఫ్ డేంజర్‌'గా మార్చేశారని సోషల్ మీడియాలో ధ్వజమెత్తారు.

New Update
TDP Ganta: భీమిలి లోకల్ మేనిఫెస్టో రిలీజ్.. కూటమి లక్ష్యం ఇదే..!

EX Minister Ganta Srinivas: విశాఖ నుంచి సీఏంగా ప్ర‌మాణ‌స్వీకారం చేస్తాన‌ని, ఇక్క‌డే ఉంటాన‌ని సీఏం జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సోషల్ మీడియాలో స్పందించారు. అదిగో వ‌స్తా.. ఇదిగో వ‌స్తాన‌ని చెబుతూ ఐదేళ్లు కాలం వెళ్ల‌దీశార‌ని విమర్శలు గుప్పించారు. 'నెలలో వస్తా.. సంక్రాంతి కి వస్తా.. ఉగాదికి వస్తా..' అంటూ ఐదేళ్ళ అంకం ముగిసిపోయింద‌ని చురకలు వేశారు చేశారు.

Also Read: వైఎస్ వివేకాను హత్య చేయించింది జగనే.. దస్తగిరి సంచలన వ్యాఖ్యాలు

'మీరు రేపు గెలిచేది లేదు.. ప్ర‌మాణస్వీకారానికి వ‌చ్చేది లేద‌ని' అంటూ గంటా కౌంటర్ వేశారు. 'సిటీ ఆఫ్ డెస్టినీ' గా ఉన్న విశాఖ‌ను సీఏం జ‌గ‌న్.. 'సిటీ ఆఫ్ డేంజర్‌'గా మార్చేశార‌ని విమర్శలు గుప్పించారు. ఎప్పుడూ ప్ర‌శాంతంగా ఉండే విశాఖ‌ను రాజ‌ధాని పేరిట ర‌ణ‌రంగ క్షేత్రంగా మార్చార‌ని ఫైర్ అయ్యారు.

ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి చిత్తశుద్దితో ఉన్నామనే సంగతి ఎన్నికలకు ఒక నెల ముందు గుర్తుకొచ్చిందా జగన్మోహన్ రెడ్డి అని నిలదీశారు. ఇక మీరు రాకముందు వరకు విశాఖ అభివృద్ధిలో దూసుకెళ్ళింద‌ని, మీరొచ్చాకే అభివృద్ధి కుంటుబడిందనేది జగమెరిగిన సత్యం అని కామెంట్స్ చేశారు. విశాఖలో ఉన్న పరిశ్రమల్ని పొరుగు రాష్ట్రాలకు తరిమేసి, ఇప్పుడేమో విశాఖలో ఉద్యోగాలు కల్పిస్తామని ఊదరకొడుతున్నారని మండిపడ్డారు.

Also Read: ఏపీ రాజధానిపై సీఎం జగన్ సంచలన ప్రకటన!

అందుకే విశాఖ ప్రజలంతా ముక్తకంఠంతో 'రావద్దు జగన్.. మాకొద్దు జగన్' అంటూ స్వరం పెంచిన విష‌యాన్ని గంటా శ్రీనివాస‌రావు గుర్తు చేశారు. మీ మాటలను నమ్మే పరిస్థితిలో విశాఖ ప్రజలు లేర‌ని, ఇక్కడి ప్రజలు చాలా తెలివైనవారని పేర్కొన్నారు. విశాఖలో ప్రమాణ స్వీకారం కాదు క‌దా.. ఇక్క‌డి నుంచే మీ ప్రభుత్వ పతనం మొదలవుతుందని గుర్తుంచుకోండి అంటూ గంటా ట్వీట్ చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు