/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/gangavaram-1-jpg.webp)
గంగవరం పోర్టు కార్మికులతో యాజమాన్యం చర్చలు సఫలమయ్యాయి. రేపటి(సెప్టెంబర్ 1) నుంచి వీధిలోకి వెళ్లడానికి కార్మికులు అంగీకరించారు. గంగవరం పోర్టు కార్మికుల సమస్యలపై యాజమాన్యం అధికారులతో చర్చించింది. మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.
మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ ఏం అన్నారంటే? :
➼ 509 మంది కార్మికులు గంగవరం పోర్టులో ఉపాధి పొందుతున్నారు.
➼ పోర్ట్ రాకలో కార్మికుల త్యాగాలు అందరికీ తెలుసు.
➼ గంగవరం పోర్టు కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వ చర్చలు సఫలం అయ్యాయి.
➼ ప్రతీ ఏటా ఇచ్చే ఎంక్రిమెంట్‌తో పాటు అదనంగా 1,500 రూపాయలు అదనంగా ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించింది.
➼ కార్మికులకు పదివేలు బోనస్ ఇవ్వడానికి అంగీకారం.
➼ ప్రమాదంలో మృతి చెందినట్లుయితే మృతుల కుటుంబాలకు 25 లక్షలు నష్ట పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది.
➼ ఇటీవల సస్పెన్షన్‌కు గురైన ఐదుగురు కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవడానికి యాజమాన్యం అంగీకరించింది.
➼ సమ్మె కాలంలోని 21 రోజుల వేతనం చెల్లించడానికి అంగీకరించిన పోర్ట్ యాజమాన్యం.
నిరసనలతో దిగొచ్చిన ప్రభుత్వం:
గత జూన్ నుంచే గంగవరం పోర్టు ఉద్యోగులు నిరసన బాట పట్టారు. విశాఖపట్నంలో తమ ఇద్దరు సహచరులను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ గంగవరం పోర్టు కార్మికులు నిరసనలు చేశారు. సహచరులను సస్పెండ్ చేసినందుకు ఓడరేవు యాజమాన్యానికి వ్యతిరేకంగా సీఐటీయూ గంగవరం పోర్టు వర్కర్స్ యూనియన్ (జీపీడబ్ల్యుయు) ఆధ్వర్యంలో ధర్నాలు చేసింది. ఇది గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తలకు దారి తీసింది. వేతనాలు పెంచాలని కోరుతూ అదానీ గంగవరం ఓడరేవు కార్మికుల ఆందోళలను ఉదృతం చేశారు. పోలీసులతో వాగ్వాదం చేశారు. కాంట్రాక్టు కార్మికులకు యాజమాన్యం కనీస వేతనం రూ.36,000 చెల్లించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. సమ్మె, తదుపరి నిరసనల కారణంగా ఓడరేవు కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం ఉద్యోగులతో మాట్లాడింది.. చర్చలు సఫలమవ్వడంతో రేపటి నుంచి ఉద్యోగులు విధుల్లోకి రానున్నారు.
ALSO READ: ఐడి కార్డులు చూపించాలి.. ఛలో విజయవాడకు హైకోర్టు ఓకే.. కండీషన్స్ అప్లై!
Follow Us