Ganesh Chaturthi 2024: గణపతి ప్రతిష్టాపనకు శుభ ముహూర్తాలు ఇవే..? ఆ సమయానికి రాహుకాలం మొదలు..!

గణపతిని శుభగడియల్లో ప్రతిష్టించడం ద్వారా జీవితంలో ఆనందం, శ్రేయస్సు కలుగుతాయని విశ్వాసం. ఈ రోజు అభిజిత్ ముహూర్తం ఉదయం 11.54 నుంచి మధ్యాహ్నం 12.44 గంటల వరకు, సర్వార్థ సిద్ధి యోగం మధ్యాహ్నం 12.34 గంటల వరకు ఉంటుంది. విగ్రహ ప్రతిష్టకు ఈ సమయాలు అనుకూలమైనవి.

New Update
Ganesh Chaturthi 2024: గణపతి ప్రతిష్టాపనకు శుభ ముహూర్తాలు ఇవే..? ఆ సమయానికి రాహుకాలం మొదలు..!

Ganesh Chaturthi 2024: దేశ వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహానగరాలతో పాటు పల్లె పల్లెల్లో, వీధి వీధుల్లో గణపతి విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. బొజ్జ గణపయ్య భక్తి కీర్తనలు, భజనలు ప్రతిధ్వనిస్తున్నాయి. ప్రతీ సంవత్సరం గణేష్ చతుర్థి భాద్రపద శుక్ల పక్ష చతుర్థి తిథి నుండి ప్రారంభమవుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 7 శనివారం అంటే ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. అయితే గణపతి విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించాలనుకునే వారు.. ప్రతిష్టాపనకు అనుకూలమైన సమయం, నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము.

గణపతి ప్రతిష్టాపనకు శుభ ముహూర్తం 

గణేషుడిని శుభ సమయంలో ప్రతిష్టించడం ద్వారా జీవితంలో ఆనందం, శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతారు. హిందూ క్యాలెండర్ ప్రకారం గణేష్ చతుర్థి రోజున.. అభిజిత్ ముహూర్తం ఉదయం 11.54 గంటల నుంచి మధ్యాహ్నం 12.44 గంటల వరకు, సర్వార్థ సిద్ధి యోగం మధ్యాహ్నం 12.34 గంటల వరకు ఉంటుంది. అలాగే చోఘడియ ముహూర్తం ఉదయం 8 నుంచి 09.33 వరకు, చాఘడియ సమయం మధ్యాహ్నం 12:38 నుంచి 2:11 వరకు ఉంటుంది. జోతిష్య శాస్త్రం ప్రకారం గణేష్ ప్రతిష్టాపనకు ఇవన్నీ అనుకూలమైన సమయాలే.

publive-image

రాహుకాలం

అలాగే రాహుకాలం ఈరోజు ఉదయం 9:10 గంటల నుంచి 10:45 వరకు ఉంటుంది. జోతిష్య శాస్త్ర ప్రకారం రాహుకాలంలో విగ్రహ ప్రతిష్టాపన చేయడం శుభప్రదంగా పరిగణించబడదు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: Ganesh Chaturthi 2024: ముంబై లాల్‌బాగ్చా రాజాకు అనంత్ అంబానీ గిఫ్ట్.. రూ.15 కోట్ల బంగారు కిరీటం! - Rtvlive.com

Advertisment
Advertisment
తాజా కథనాలు