Ganesh Chaturthi 2023: వెయ్యేళ్ల క్రితం వెలసిన గణేషుడు.. ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే..

వేల అడుగుల ఎత్తైన కొండలు.. అందమైన జలపాతాలు ఆ రాష్ట్రం సొంతం.. మావోయిస్టులు, పోలీసుల మధ్య యుద్ధంతో ఆ అడవుల్లో ఎప్పుడూ తుపాకుల మోతలు వినిపిస్తునే ఉంటాయి. అంతేకాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించగల ఖనిజ సంపదలు కూడా ఆ కీకారణ్యంలోనే నెలవై ఉన్నాయి.

Ganesh Chaturthi 2023: వెయ్యేళ్ల క్రితం వెలసిన గణేషుడు.. ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే..
New Update

Dholkal Hill Mystery Ganesh: వేల అడుగుల ఎత్తైన కొండలు.. అందమైన జలపాతాలు ఆ రాష్ట్రం సొంతం.. మావోయిస్టులు, పోలీసుల మధ్య యుద్ధంతో ఆ అడవుల్లో ఎప్పుడూ తుపాకుల మోతలు వినిపిస్తునే ఉంటాయి. అంతేకాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించగల ఖనిజ సంపదలు కూడా ఆ కీకారణ్యంలోనే నెలవై ఉన్నాయి. దాంతోపాటు అత్యంత ఎత్తైన ప్రదేశంలో వెయ్యేళ్ల క్రితం నాగవంశీకులు ప్రతిష్టించిన భారీ గణేషుడు కూడా అక్కడే ఉన్నాడు. ఇంత ప్రఖ్యాత కలిగిన ఆగణేషున్ని దర్శించాలంటే ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం దంతెవాడ జిల్లా బైలడిల్లా ప్రాంతంలోని డోల్కాల్ గుట్టలకు చేరుకోవాల్సిందే..

మగధీర గణేష్..

మగధీర సినిమాలోని శివుడు గ్రాఫిక్.. కానీ వినాయకుడు ఒరిజినల్.. వేల అడుగుల ఎత్తులో ప్రకృతి రహస్యంగా ఉన్న గణేషుడి విగ్రహం ఇప్పటికీ ఒక మిరాకిల్. వెయ్యి సంవత్సరాల క్రితం నాగ వంశస్థులు ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారని కథనం. ఓరుగల్లును పాలించిన కాకతీయ రాజులు కొలిచిన వినాయకుడు.. దంతేవాడ జిల్లా బైల డిల్లా ప్రాంతంలోని డోల్కాల్ గుట్టలపై గణేషుడు ఒక్కడే. మగధీర సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఈ గణేషుడిని చూసే ఉంటారు. మగధీర సినిమాలో మహాశివుడు ఉన్న ప్రాంతంగా చూపించిన ప్రదేశం గ్రాఫిక్స్. అయితే ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఈ గణేషుడు దంతేవాడ జిల్లాలో ఉన్న అడవుల్లో డోల్కాల్ గుట్టపై వెలిశాడు. ఇక్కడ గుహలు, జలపాతాలు, ఎత్తైన కొండలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ శాసించగల ఖనిజ సంపదలు దంతేవాడ జిల్లాకే సొంతం. అలాంటి జిల్లాలో వెయ్యి సంవత్సరాల క్రితం నాగ వంశస్థులు ఈ ప్రాంతంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారని ఇక్కడి ప్రజల విశ్వాసం. డోల్కాల్ గుట్టలపై కొలువుదీరిన ఈ వినాయకుడికి వద్దకు చేరుకోవడం ఎంత కష్టం అంటే మాటల్లో చెప్పలేనంత కష్టం.

publive-image

ఎవరు ప్రతిష్టించారు?

నిటారుగా ఉండే కొండలు, వాటిని దాటిన తర్వాత వచ్చే జలపాతాలు, అవి కూడా దాటి ముందుకు వెళితే వచ్చే మరో పెద్ద కొండ.. ఆ కొండపై ప్రాంతంలో కొలువు తీరిన వినాయకుడు. ఈ విగ్రహం అంత పెద్ద అడవిలో అంత పెద్ద కొండ పై ఎలా వచ్చింది? అనేది మాత్రం చాలా రహస్యం. అక్కడ ఉన్న గ్రామస్తులు నిర్మించారా? లేక మరెవరైనా నిర్మించారా? అనేది ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. కానీ జిల్లాలో ఉన్నటువంటి చాలా గ్రామాల ప్రజలు 1000 సంవత్సరాల క్రితం నాగ వంశస్థులు ఈ ప్రాంతాన్ని పరిపాలించే రోజుల్లో ఈ విగ్రహానికి ప్రతిష్టించి పూజలు చేశారని చెబుతున్నారు. రోడ్డు మార్గం నుండి దాదాపు 16 కిలోమీటర్లు ప్రయాణిస్తే కానీ ఈ వినాయకుడికి చేరుకోలేరు.

ఇది కూడా చదవండి: నేటి నుంచే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఏ అంశాలపై చర్చించనున్నారంటే..

ఇంద్రావతి నది పక్కన..

చత్తీస్‌ఘడ్‌ అడవుల్లో ఇంద్రావతి నది పక్కన ఉన్న డోల్కాల్ గుట్టలపై లంబోదరుడు కొలువుదీరాడు. ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో కొలువుదీరిన వినాయకుడు. ఆయనపై అక్కడి ప్రజలకు ఎంతో విశ్వాసం. ఋషులు, మునులు ఈ వినాయకుని పూజించారని ఇక్కడి ఆదివాసీలు చెబుతుంటారు. అంతేకాదు త్రిలోక సంచార నారద మునీంద్రుడు కూడా ఈ గణపతిని దర్శించారని ఇక్కడ ప్రజలు చెబుతుంటారు. అయితే, ఇప్పటివరకు 50 నుంచి 100 మంది భక్తులు మాత్రమే ఈ గణనాథుడిని చేరుకున్నట్లు తెలుస్తోంది. నిటారుగా ఉండే కొండలు రహదారి సౌకర్యం కూడా లేని ఎత్తయిన కొండలు, కాకులు దూరని కారడవి చత్తీస్‌గఢ్ అడవుల్లో వెలిసిన ఈ గణేష్ శిలా రూపం అత్యద్భుతం ఒక రహస్యం.

publive-image

అన్నీ ప్రశ్నలే..

ఈ గణేషుడు ఇక్కడ ఎలా వెలిశాడు? ఎవరైనా చెక్కారా? లేదా తీసుకొచ్చి ప్రతిష్టించారా? అన్నీ అనుమానాలే. ఇప్పుడైతే అక్కడికి వెళ్లడం చాలా కష్టమైన పని. కానీ, వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం ఎలా ఉంది? అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే ఆదివాసీల సహాయం లేకుండా సాధ్యం కాదు. క్రూర జంతువులు, విష పురుగులతో నిండి ఉన్న ఈ ప్రాంతానికి వెళ్లడం అంటే సాహసోపేతమే అని చెప్పాలి. అయితే ప్రస్తుతం అక్కడి ప్రభుత్వం ఈ మగధీర గణేష్ ను చూసేందుకు వీలుగా పర్యాటకంగా ప్రాంతంగా తీర్చి దిద్దింది. అటు లంబోదరుని దర్శనం కోసం వచ్చే భక్తులకు, ప్రకృతి ప్రేమికులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని అన్ని ఏర్పాట్లను చేసింది. అయితే ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ అడవిలో 16 కిలో మీటర్లు ప్రయాణించిన తర్వాతే మగధీరుని గణేష్ ని దర్శనం లభిస్తుంది.

publive-image

Also Read:

Ganesh Chaturthi: వరసిద్ధి వినాయకుడి సన్నిధిలో బ్రహ్మోత్సవ వేడుకలు.. సర్వాంగసుందరంగా ఆలయం ముస్తాబు..

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe