Gaami Movie Trailer: గామి గ్రాఫిక్స్ అదుర్స్.. ఇప్పుడు అంతా అదే చర్చ!

విష్వక్సేన్ తాజా సినిమా గామి. సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల అయింది. ట్రైలర్ లోని గ్రాఫిక్స్, బీజీఎం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా మార్చి 8న థియేటర్లలోకి రానుంది. 

New Update
Gaami Movie Review: కొత్తదనం కావాలనుకునే వారి కోసం గామి.. విశ్వక్ మాటలు కరెక్టే!

Gaami Movie Trailer: విష్వక్సేన్ హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది గామి. ఇటీవల సినిమా ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ లో గ్రాఫిక్స్ చూస్తుంటే.. మళ్ళీ మరో హనుమాన్ సినిమా వస్తోంది అనిపిస్తోంది. తక్కువ ఖర్చుతో అద్భుతమైన అవుట్ పుట్ తో గామి గ్రాఫిక్స్ అదిరిపోయాయని ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ అంటున్నారు. నిజానికి గామి సినిమా మొదలయ్యి దాదాపుగా ఐదేళ్లు అయింది. అప్పట్లో ఈ సినిమాని క్రౌడ్ ఫండింగ్ తో తీసుకువస్తున్నట్లు చెప్పుకున్నారు. ఇప్పుడు గామి ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం యూవీ క్రియేషన్స్ రంగంలోకి దిగింది. దీంతో సినిమా రేంజ్ మరింత పెరిగింది. 

ఇక సినిమా(Gaami Movie Trailer) ట్రైలర్ చూస్తుంటే.. సైన్స్ ఫిక్షన్ లా కనిపిస్తోంది.. హిమాలయాల్లో హీరో సాహస యాత్ర ఉంటుందని అర్ధం అవుతోంది. ఆమధ్య వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం తరువాత ఆ రేంజిలో మంచు కొండలను అద్భుతంగ చితీకరించినట్టు కనిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ స్పెషల్ ప్రాజెక్ట్. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ ఈ సినిమాని నిర్మించగా.. చాందినీ చౌదరి కథానాయికగా కనిపిస్తుంది. 

Also Read: వెంకటేష్.. అనిల్ రావిపూడి కాంబినేషన్.. హీరోయిన్ గా గుంటూరు కారం బ్యూటీ!

దర్శకుడు విద్యాధర్ ఐదేళ్ల క్రితం వెళ్ళిపోమాకే సినిమా చూసిన తరువాత విష్వక్సేన్(Gaami Movie Trailer) ను కలిసి సినిమా గురించి చెప్పారు. అప్పుడే ఈ సినిమాకి ఐదేళ్లు పడుతుందని తనకు తెలుసని విష్వక్సేన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సినిమాని సంవత్సరంలో తీసేయాలి అంటే కనుక కనీసం 100 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. వారణాసి కుంభమేళాలో గొరిల్లా షూట్ చేశామని.. ఆ విధంగా బడ్జెట్ కలిసి వచ్చిందనీ విష్వక్సేన్ చెప్పారు. సమయమే దీనికి పెట్టుబడి అనీ.. ఎప్పుడు వచ్చినా ఇది కొత్త సినిమాలనే ఉంటుందనీ.. ఇప్పటివరకూ ఈ తరహాలో ఎవరూ సినిమా తీయలేదని విష్వక్సేన్ చెబుతున్నారు. 

ఇదిలా ఉంటే.. సినిమా ట్రైలర్ కి మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. గ్రాఫిక్స్.. బీజీఎమ్ అదిరిపోయాయని ప్రేక్షకులు అంటున్నారు. మళ్ళీ ఒక హిట్ సినిమాని చూడబోతున్నామని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 గామి ట్రైలర్ ఇక్కడ చూడొచ్చు:

Advertisment
తాజా కథనాలు