The Beast at G20: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Biden) ఇవాళ సాయంత్రం(7గంటల) ఇండియాకు రానున్నారు. రేపు(సెప్టెంబర్ 9), ఎల్లుండి(సెప్టెంబర్ 10) జీ20 సమ్మిట్(G20 summit)కి ఇండియా హోస్ట్‌గా వ్యవహరించనుంది. ఆయన భార్య జిల్ బైడెన్ కరోనా బారిన పడడంతో అగ్రరాజ్య అధ్యక్షుడికి కూడా కొవిడ్ టెస్ట్ చేశారు.
అందులో రెండుసార్లూ బైడెన్‌కి నెగిటెవ్ వచ్చింది. దీంతో ఆయన ఇండియా రాకకు లైన్ క్లియర్ అయ్యింది. న్యూఢిల్లీలోని ఐటీసీ మౌర్య షెరటన్‌లో బస చేస్తారు . రాష్ట్రపతికి పలు భద్రతా చర్యలు చేపట్టారు. హోటల్లోని ప్రతి అంతస్తులో సీక్రెట్ సర్వీస్ కమాండోలను మోహరిస్తారు. బైడెన్‌ను 14వ అంతస్తులోని ఆయన గదికి తీసుకెళ్లడానికి ప్రత్యేక లిఫ్ట్‌ను ఏర్పాటు చేస్తారు. ఇక బైడెన్‌తో పాటు మరో ప్రత్యేక అతిథి ఇండియాకు రానుంది. అదే ‘బీస్ట్’..!
G20 Beast: ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కారు.. బైడెన్‌తో పాటు దేశానికి కొత్త అతిథి!
అందరూ ఎదురుచూస్తున్న గ్లోబల్ లీడర్స్ ఈవెంట్, 18వ జీ20 సమ్మిట్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉండగా.. భారత్‌కు అమెరికా నుంచి ఇద్దరు అతిథిలు రానున్నారు. అందులో ఒక స్పెషల్ గెస్ట్ కూడా ఉంది. అదే అమెరికా అధ్యక్షుడి కారు 'బీస్ట్'. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కారు ఇది. పెద్ద సైనిక రవాణా విమానం బోయింగ్ C-17 గ్లోబ్‌మాస్టర్-IIIలో అమెరికా నుంచి ఇండియాకు తీసుకురానున్నారు.
Translate this News: