G20 Summit 🔴LIVE updates: జీ20 సమ్మిట్ లైవ్ అప్డేట్స్.. అతిథులకు మోదీ స్వాగతం..!

జీ20 సమ్మిట్ వేళ ప్రపంచం చూపు ఇండియా వైపే పడింది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరుగుతున్న G20 సమ్మిట్ వేదిక అయిన భారత్ మండపానికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. అతిథులకు స్వాగతం పలుకుతున్నారు

New Update
G20 Summit 🔴LIVE updates: జీ20 సమ్మిట్ లైవ్ అప్డేట్స్.. అతిథులకు మోదీ స్వాగతం..!


G20 Summit in Delhi Live Updates: జీ20 సమ్మిట్ వేళ ప్రపంచం చూపు ఇండియా వైపే పడింది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరుగుతున్న G20 సమ్మిట్ వేదిక అయిన భారత్ మండపానికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు.
అతిథులకు స్వాగతం పలుకుతున్నారు

  • Sep 09, 2023 13:59 IST
    జీ20లో చేరిన ఆఫ్రికన్ యూనియన్‌పై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా పోస్ట్



  • Sep 09, 2023 13:58 IST
    జీ20 సమ్మిట్ పై మోదీ ట్వీట్.. వైరల్



  • Sep 09, 2023 13:57 IST
    కలిసి ఈ సవాళ్లను ఎదుర్కోగలమని నేను నమ్ముతున్నాను- రిషి సునాక్



  • Sep 09, 2023 13:16 IST
    పేకమేడల్లా కూలిన బతుకులు.. మొరాకోలో భూకంపం కారణంగా 632 మంది మృతి..!



  • Sep 09, 2023 12:34 IST
    ఒడిషా కోణార్క్ వీల్ గురించి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌కి వివరించిన ప్రధాని మోదీ



  • Sep 09, 2023 11:37 IST
    G20లో చేరిన ఆఫ్రికన్ యూనియన్



  • Sep 09, 2023 11:32 IST
    దేశాన్ని మిడిల్ ఈస్ట్, యూరప్‌కు కలిపే రైలు, షిప్పింగ్ కారిడార్‌ను ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ, జో బైడెన్



  • Sep 09, 2023 11:29 IST
    యూనియన్ ఆఫ్ కొమొరోస్ ప్రెసిడెంట్ , ఆఫ్రికన్ యూనియన్ (AU) ఛైర్‌పర్సన్ వీడియో



  • Sep 09, 2023 11:26 IST
    మనమందరం కలిసి కదలాల్సిన సమయం ఇది.. జీ20 సమావేశంలో మోదీ కీలక వ్యాఖ్యలు



  • Sep 09, 2023 11:22 IST
    'సబ్కా సాత్'కు పిలుపునిచ్చిన మోదీ



  • Sep 09, 2023 09:46 IST
    ప్రపంచ నాయకులు G20 సమ్మిట్ వేదిక వద్దకు రావడం ప్రారంభించారు.. వారికి ప్రధాని మోదీ స్వాగతం పలికారు



  • Sep 09, 2023 09:44 IST
    ల్లీలోని G20 సమ్మిట్ వేదికగా ఉన్న భారత్ మండపంలో WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్‌కు ప్రధాని మోదీ స్వాగతం పలికారు.



  • Sep 09, 2023 09:41 IST
    భారత్ మండపం వేదిక వద్ద ప్రపంచ నాయకులకు ప్రధాని మోదీ స్వాగతం



  • Sep 09, 2023 08:37 IST
    జీ20 సమ్మిట్ ప్రత్యక్ష ప్రసారం: కన్నాట్ ప్లేస్ నుంచి దృశ్యాలు!



  • Sep 09, 2023 07:37 IST
    భారత్ మండపం నుంచి తాజా విజువల్స్



  • Sep 09, 2023 06:56 IST
    జీ20: వివిధ దేశాల ఆర్థికశాఖ మంత్రులతో సీతారామన్ విందు!



  • Sep 09, 2023 06:26 IST
    ఈరోజు జీ20 సమ్మిట్ షెడ్యూల్ టైమింగ్స్

    ఈ రోజు (సెప్టెంబర్ 9వ తేదీ) తాత్కాలిక G20 సమ్మిట్ 2023 షెడ్యూల్ ఇక్కడ ఉంది:

    09:20-10:20 గంటలు : భారత మండపానికి రాక

    10:30-13:30 గంటలు : సెషన్ 1 – వన్ ఎర్త్

    13:30-15:00 గంటలు : సమావేశాల కోసం విండో

    15:00-16:45 గంటలు : సెషన్ 2 – ఒక కుటుంబం

    16:45-17:30 గంటలు: సమావేశాల కోసం విండో

    19:00 - 21:15: రాష్ట్రపతిచే విందు



  • Sep 09, 2023 06:24 IST
    వేదిక నుండి నేరుగా చిత్రాలను చూడండి!

    (Image credit: Huma Siddiqui/FE.com)

    (Image credit: Huma Siddiqui/FE.com)



  • Sep 09, 2023 06:21 IST
    G20 సమ్మిట్ షెడ్యూల్ సెప్టెంబర్ 9

    నేటి షెడ్యూల్‌లో, అంటే సెప్టెంబర్ 9వ తేదీ, వివిధ సెషన్‌లు, భారత్ మండపం లెవల్ 1లో ద్వైపాక్షిక సమావేశాలు, చెట్లను నాటే కార్యక్రమంతో పాటు ప్రత్యక్ష ప్రదర్శనలు కూడా ఉంటాయి! 



  • Sep 08, 2023 22:53 IST
    ఇండియాలో G20 శిఖరాగ్ర సమావేశం జరగడం నిజంగా అద్భుతం.. బైడెన్ ట్వీట్..



  • Sep 08, 2023 22:51 IST
    యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో శాశ్వత సభ్య దేశంగా సపోర్ట్ ఇస్తామని ప్రకటించిన అమెరికా..



  • Sep 08, 2023 21:49 IST
    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌కు ఆహ్వానించినందుకు సంతోషంగా ఉంది: ప్రధాని మోదీ

    G20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించి ఓ ట్వీట్ చేశారు మోదీ. ‘అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ను 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌కు స్వాగతించినందుకు సంతోషంగా ఉంది. మా సమావేశం చాలా ఉత్పాదకమైంది. భారతదేశం, యుఎస్‌ఎల మధ్య ఆర్థిక, ప్రజల మధ్య సంబంధాలను మరింత పెంచే అనేక అంశాలపై చర్చించడం జరిగింది. మన దేశాల మధ్య స్నేహం ప్రపంచ మేలును పెంపొందించడంలో గొప్ప పాత్ర పోషిస్తూనే ఉంటుంది.‘ అని ప్రధాని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.



  • Sep 08, 2023 21:45 IST
    ఢిల్లీలోని బ్రిటిష్ కౌన్సిల్‌లో విద్యార్థులు, సిబ్బందితో సరదాగా గడిపిన బ్రిటన్ ప్రధాని రుషి సునాక్..



  • Sep 08, 2023 21:42 IST
    బైడెన్‌తో భేటీ వివరాలను వెల్లడించిన ప్రధాని మోదీ..

    భారతదేశం, యునైటెడ్ స్టేట్స్ అమెరికా మధ్య సన్నిహిత, శాశ్వతమైన భాగస్వామ్యాన్ని పునరుద్ఘాటిస్తూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు భారతదేశానికి వచ్చిన యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ బిడెన్‌ను స్వాగతించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు, ఇతర రంగాల్లో సంయుక్త భాగస్వామ్యంపై కీలక చర్చలు జరిగినట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.



  • Sep 08, 2023 21:40 IST
    అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు తన నివాసంలో స్వాగతం పలికిన ప్రధాని మోదీ..



  • Sep 08, 2023 21:38 IST
    వెలుగు జిలుగులతో జిగేల్‌మంటోన్న న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ బిల్డింగ్..



  • Sep 08, 2023 21:37 IST
    బంగ్లా దేశ్ ప్రధాని షేక్ హసీనాతో భేటీ అయిన ప్రధాన మోదీ..

    గత 9 ఏళ్లలో భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు మరింత పెరిగాయని, ఇది సంతోషకరమైన అంశం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ భేటీలో కనెక్టివిటీ, వాణిజ్య సంబంధాలపై చర్చించడం జరిగిందన్నారు.



  • Sep 08, 2023 21:35 IST
    మారిషస్ ప్రధానితో భారత ప్రధాని భేటీ..

    భారత్-మారిషస్ సంబంధాలకు ఇది ప్రత్యేక సంవత్సరం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మారిషస్ ప్రధాని కుమార్ జగ్నౌత్‌తో స్నేహపూర్వక భేటీ జరిగిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ భేటీలో ఇరు దేశాల మధ్య మౌలిక సదుపాయాలు, ఫిన్‌టెక్, సంస్కృతి, ఇతర రంగాల్లో సహాయ సహకరాపై చర్చించడం జరిగిందన్నారు.



  • Sep 08, 2023 21:31 IST
    లైటింగ్, ఫౌంటేన్స్‌తో జిగేల్‌మంటున్న భారత్ మండపం పరిసర ప్రాంతాలు..

    ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో G20 సదస్సు జరుగనుంది. ఈ సదస్సు నేపథ్యంలో భారత్ మండపం ప్రాంతంలో సౌండ్ అండ్ ఫౌంటేన్ షోను ఏర్పాటు చేశారు. భారత్ మండపాన్ని అందంగా, ముస్తాబు చేశారు. ఆ పరిసరాలు చూసేందుకు రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. భారత్ మండపం వేదికగా సెప్టెంబర్ 09, 10 తేదీల్లో G20 శిఖరాగ్ర సమావేశం జరుగనున్న విషయం తెలిసిందే.



  • Sep 08, 2023 21:24 IST
    G20 సమావేశానికి హాజరయ్యేందుకు ఇండియాకు చేరుకున్న చైనా ప్రతినిథి..

    G20 సమావేశానికి హాజరయ్యేందుకు ఇండియాకు చేరుకున్న చైనా ప్రతినిథి..

    #WATCH | G-20 in India | Li Qiang, Premier of the People's Republic of China, arrives in Delhi for the G-20 Summit pic.twitter.com/h4Z8CmU89G

    — ANI (@ANI) September 8, 2023



Advertisment
Advertisment
తాజా కథనాలు