G20 Summit; జీ 20 అతిథులకు ఇడ్లీ. చిట్టిగారె, మసాలా దోశె!

దక్షిణాదిన చాలా ఫేమస్‌ అయిన ఇడ్లీ, చిట్టిగారె, మసాలా దోశె, జిలేబీ, రసగుల్లా వంటివి ఉన్నాయి. ఇంకా పానీపూరీ, దహీ భల్లా, సమోసా, భేల్ పూరి, వడ పావ్‌, చత్పతి ఛాట్ లు కూడా అతిథులను అలరించనున్నాయి

G20 Summit; జీ 20 అతిథులకు ఇడ్లీ. చిట్టిగారె, మసాలా దోశె!
New Update

ఢిల్లీ లో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జీ 20 సదస్సు కోసం అప్పుడే నగరం మొత్తం సర్వాంగ సుందరంగా ముస్తాబు అయ్యింది. ఈ నెల 9,10 తారీఖుల్లో రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. వీటికి దేశాధినేతలతో పాటు విదేశాల నుంచి కూడా అతిథులు విచ్చేస్తున్నారు.

ఈ క్రమంలోనే భారతీయ సంస్కృతిని, సంప్రదాయాలను వారికి చూపించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేసింది. ఈ ఏర్పాట్లతో పాటు విదేశాల నుంచి విచ్చేయుచున్న ముఖ్యమైన అతిథులకు వారితో పాటు వచ్చే మరికొంత మందికి ప్రత్యేక విందును ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం.

రకరకాల విందులతో పాటు అతిథుల కోసం ప్రత్యేకంగా మిల్లెట్స్, స్ట్రీట్‌ ఫుడ్ ని కూడా వారికి అందించనున్నారు. భారతీయ ప్రాంతీయ వంటకాలను అతిథుల మెనూలో చేరిపోయాయి. ఈ సమ్మిట్ కోసం విచ్చేస్తున్న అతిథులకు భారత్ లోని ప్రతి రాష్ట్రం నుంచి ఒక ఆహార పదార్థాన్ని అందించనున్నారు.

ఈ మెనూలో లిట్టి చోఖా, మిల్లెట్లతో ప్రత్యేకంగా రూపొందించిన రాజస్థానీ దాట్‌ బాటి చుర్మా, పంజాబీ కు చెందిన తడ్కా దాల్‌లతో పాటు దక్షిణాదిన చాలా ఫేమస్‌ అయిన ఇడ్లీ, చిట్టిగారె, మసాలా దోశె, జిలేబీ, రసగుల్లా వంటివి ఉన్నాయి. ఇంకా పానీపూరీ, దహీ భల్లా, సమోసా, భేల్ పూరి, వడ పావ్‌, చత్పతి ఛాట్ లు కూడా అతిథులను అలరించనున్నాయి. ఈ సమావేశంలో ప్రత్యేకంగా మిల్లెట్‌తో తయారు చేసిన సమోసాలు, పరాఠాలు, ఖీర్ మరియు హల్వా వడించనున్నారు.

ప్రపంచ నాయకులకు వెండి , బంగారు పూత పూసిన పాత్రల్లో ఆహార పదార్థాలను అందించనున్నట్లు అధికారులు తెలిపారు. భారతీస సంస్కృతి ఉట్టిపడేలా ఈ ఏర్పాట్లను చేస్తున్నట్లు భారత ప్రభుత్వం తెలిపింది. ఈ సమావేశాల్లో మరో ప్రత్యేకత ఏంటి అంటే ప్రతి దేశం నాయకుడు కూడా ఈ సమావేశంలో ఓ మొక్కను నాటి జీ 20 తోటను ఏర్పాటు చేయనున్నారు.

#national #food-items #g20-summit
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe