Flights Cancelled: 160 విమానాలు రద్దు..ఎందుకంటే!

మరి కొద్ది రోజుల్లో ఢిల్లీ (delhi)నగరంలో జీ 20 సమ్మిట్(g 20 summit) జరగనుంది. దీనికి దేశవిదేశాల నుంచి అధినేతలు వస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో పాటు..భద్రతా వ్యవహారాల్లో కూడా కేంద్రం ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది.

Flights Cancelled: 160 విమానాలు రద్దు..ఎందుకంటే!
New Update

మరి కొద్ది రోజుల్లో ఢిల్లీ (delhi)నగరంలో జీ 20 సమ్మిట్(g 20 summit) జరగనుంది. దీనికి దేశవిదేశాల నుంచి అధినేతలు వస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో పాటు..భద్రతా వ్యవహారాల్లో కూడా కేంద్రం ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఢిల్లీ పరిధిలో మూడు రోజుల పాటు డెలివరీలను కూడా నిలిపివేశారు.

స్విగ్గీ, జొమాటో,అమెజాన్ వంటి డెలివరీలను మూడు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. రైల్వే శాఖ కూడా సుమారు 300 రైళ్లను నిలిపివేసింది. ఈ క్రమంలోనే సుమారు 160 విమానాలను(160 flights) రద్దు చేస్తున్నట్లు ఎయిర్‌ పోర్టు అధికారులు వెల్లడించారు. అయితే ఇది అంచనా మాత్రమే అని తెలిపారు.

అయితే రద్దు చేసే 160 విమానాలు కూడా దేశీయ విమానాలే అని అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ నుంచి వచ్చేవి 80, ఢిల్లీ నుంచి వెళ్లేవి 80 మొత్తం 160 సర్వీసులను రద్దు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే 160 అనేది కేవలం అంచనా మాత్రమే అని..మరికొన్ని విమానాలు కూడా రద్దయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తుంది.

అంతర్జాతీయ విమాన సర్వీసులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు పేర్కొన్నారు. జీ 20 సదస్సు కారణంగా ప్రయాణీకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎయిర్‌ పోర్టు అధికారులు తెలిపారు. ఇందు కోసం అన్ని విమానాయన సంస్థల ప్రతినిధులతో కలిసి పని చేస్తున్నట్లు చెప్పారు.

సెప్టెంబర్ 8 నుంచి 11 మధ్యలో విమాన ప్రయాణాల సమయంలో సర్వీసులు, స్టేటస్‌ లను జాగ్రత్తగా చెక్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు. విమానాశ్రయానికి వచ్చే ప్రయాణీకులు కూడా ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా ముందుగానే విమానాశ్రాయానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.

#delhi #flights #g20-summit #potics
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe