SL vs PAK Test: సరదా ఘటన.. క్యాచ్ పట్టేందుకు కీపర్ ఇలా.. దొరక్కుండా బ్యాటర్ అలా

క్యాచ్ మిస్.. మ్యాచ్ మిస్.. అని మాజీ క్రికెటర్లు చెబుతూ ఉంటారు. ఇలా క్యాచ్ మిస్ చేసిన అనేక మ్యాచుల్లో విజయాలు కూడా తారుమారు అయ్యాయి. అందుకే ఫీల్డర్లు క్యాచ్ పెట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అలాంటి ఘటనలు నవ్వులు కూడా తెప్పిస్తూ ఉంటాయి. తాజాగా లంక-పాక్ టెస్టు మ్యాచులో ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్‌నే జరిగింది.

SL vs PAK Test: సరదా ఘటన.. క్యాచ్ పట్టేందుకు కీపర్ ఇలా.. దొరక్కుండా బ్యాటర్ అలా
New Update

funny incident in srilanka-pakistan-first-test-match-viralగాలె స్టేడియం వేదికగా పాకిస్థాన్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఓ సరదా ఘటన ఆటగాళ్లతో పాటు ఆడియన్స్‌కు నవ్వులు తెప్పించింది. 120 ఓవర్లో రమేశ్ మెండిస్ వేసిన 5వ బంతి పాక్ బ్యాటర్ అబ్రార్ గ్లవ్ తాకి ప్యాడ్‌లో ఇరుక్కుపోయింది. దీంతో లంక ప్లేయర్లంతా ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేశారు. అయితే బంతి అబ్రార్ ప్యాడ్‌లో ఇరుక్కుపోయిన సంగతి గమనించిన వికెట్ కీపర్ సదీర సమరవిక్రమ.. బంతిని తీసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ అబ్రార్ మాత్రం ముందుకు వస్తూ బంతి దొరక్కుండా క్రీజు నుంచి దూరం జరిగాడు. ఈలోపు బంతి కిందపడింది. స్టంప్ అవుట్ కాకుండా మళ్లీ వెంటనే క్రీజు వైపు పరిగెత్తాడు. ఈ సీన్ చూసిన ఇరు జట్ల ఆటగాళ్లు తెగ నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అయితే నవ్వు ఆపుకోలేకపోయాడు.

తొలి పాక్ ఆటగాడిగా రికార్డు..

ఇక ఈ మ్యాచులో పాకిస్థాన్ ఆటగాళ్లు రెచ్చిపోయారు. సాద్ షకీల్ 208 పరుగులు చేయడంతో పాకిస్థాన్ 149 పరుగుల భారీ ఆధిక్యం సంపాందించింది. ఓవర్ నైట్ స్కోర్ 221/5తో మూడో రోజు ఆట ప్రారంభించిన పాక్ 461 పరుగులకు ఆలౌట్ అయింది. శ్రీలంకలో డబుల్ సెంచరీ చేసిన తొలి పాక్ ఆటగాడిగా షకీల్ రికార్డు సృష్టించాడు. మరో ఆటగాడు సల్మాన్ 83 పరుగులతో రాణించాడు. ప్రస్తుతం నాలుగో రోజు ఆటలో శ్రీలంక ఆచిచూతి ఆడుతూ స్వల్ప ఆధిక్యంలోకి వచ్చింది. తొలి ఇన్నింగ్స్లో 312 పరుగులకు ఆలౌట్ అయింది.

మరికొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్..

సాధారణంగా క్రికెట్ లో స్పిన్ బౌలర్ బౌన్సర్ వెయ్యడం అనేది చాలా అరుదు. అలాంటిది అఫ్గాన్ యంగ్ బౌలర్ కైస్ అహ్మద్ డెడ్లి బౌన్సర్ వేసాడు. హెల్మెట్ పెట్టుకోకుండా బ్యాటింగ్ చేస్తున్న విండీస్ ఆటగాడు రస్సెల్ ఈ బంతి దెబ్బకు బిత్తరపోయాడు.

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో మినిస్టర్ ఢాకా బాట్స్మన్ ఆండ్రే రస్సెల్ సింగిల్ కోసం వెళ్ళాడు. అయితే అక్కడ ఫీల్డర్ బాల్ అందుకుని స్ట్రైకర్ ఎండ్ లో రన్ అవుట్ కోసం ట్రై చేసాడు. కానీ ఆ బాల్ అనూహ్యంగా స్ట్రైకర్ ఎండ్‌లోని స్టంప్స్‌కు తగిలింది. దీంతో రస్సెల్ రనౌట్ అయి వెనుదిరిగాడు.

What A Strike!#SLvAUS #DineshChandimal #MitchellStarcpic.twitter.com/H73UCbK4LJ

— CRICKETNMORE (@cricketnmore) July 11, 2022

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచులో లంక బ్యాటర్ దినేష్ చండీమల్ స్టార్క్ వేసిన బాల్‌ను భారీ సిక్సర్ కొట్టాడు. అయితే ఆ బాల్ స్టేడియం బయట రోడ్డుపై బౌన్స్ అయ్యి అక్కడ నడుస్తున్న ఓ కుర్రాడికి తగిలింది. దీంతో అక్కడ ఉన్న వారు మొదట షాక్ అయి తర్వాత నవ్వుకుంటూ వెళ్లిపోయారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe