Ayodhya : అయోధ్య వెళ్లాలనుకుంటున్నారా? మీకో గుడ్ న్యూస్..ఈ జిల్లా నుంచి నేరుగా రైలు.. పూర్తి వివరాలివే..!!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు పేరుతో 07218 నెంబర్ తో ఈ నెల 11వ తేదీన సామార్లకోట కాకినాడ, సామార్లకోట నుంచి అయోధ్య వేళ్లేందుకు ప్రత్యేక రైలు ఏర్పాటు రైల్వే శాఖ. సామర్లకోట, తుని, అనకాపల్లి, విశాఖ మీదుగా ఈ రైలు అయోధ్యకు చేరుకుంటుంది.

Trains Cancelled: వందేభారత్‌ తో పాటు 22 రైళ్లు రద్దు!
New Update

Ayodhya : యావత్ ప్రపంచం గర్వించే విధంగా అయోధ్య(Ayodhya) లోని శ్రీరామ ప్రాణప్రతిష్ట(Prana Pratishtha) జరిగింది. ఈ కార్యక్రమానికి దేశం నుంచే కాదు ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. ప్రాణప్రతిష్ట అనంతరం సామాన్యులకు దర్శనం చేసుకునే భాగ్యం కల్పించారు. అప్పటి నుంచి దేశం నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకు తరలివస్తున్నారు. విమానాలు, రైళ్ల ద్వారా జనం అయోధ్య బాట పడుతున్నారు. భక్తుల రద్దీని ద్రుష్టి లో ఉంచుకుని రైల్వే శాఖ కొన్ని ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేసింది. అయితే ఇప్పటి వరకు యూపీ వెళ్లాలంటే రెండు రైళ్లు మారాల్సి ఉండేది.

అయితే ఇప్పుడు నేరుగా సామాన్య ప్రాంతాల నుంచి కూడా అయోధ్య కు వెళ్లి శ్రీరాముడిని దర్శనం చేసుకుని మరలా తిరిగి అదే రైల్లో వారి స్వగ్రామాలకు వచ్చే విధంగా ప్రత్యేక రైలు(Special Train) ను ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. ఇంతకీ ఆ ఉమ్మడి జిల్లాల్లో ఎక్కడి నుంచి రైలు ప్రారంభం అవుతుందో తెలుసుకుందాం.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి రాజమండ్రి(Rajahmundry) లేదా సామర్లకోట, తుని ఈ రైల్వే స్టేషన్లో అయోధ్య లేదా కాశీ క్షేత్రానికి వెళ్లాలనుకుంటే రెండు రైళ్లు మారాల్సి ఉండేది. రాజమండ్రి, నుంచి విశాఖ వరకు ఒక రైలు... విశాఖ(Vizag) నుంచి భువనేశ్వర్ వరకు మరొకరైలు.. భువనేశ్వర్ నుంచి కాశీ లేదా అయోధ్యకు మరో రైలు మారాల్సి వచ్చేది. అయితే ప్రతిఒక్కరూ అయోధ్య దర్శనం చేసుకునే విధంగా రైల్వే శాఖ ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. ప్రత్యేక రైలు పేరుతో 07218 నెంబర్ తో ఈ నెల 11వ తేదీన సామార్లకోట కాకినాడ, సామార్లకోట నుంచి అయోధ్య వేళ్లేందుకు ప్రత్యేక రైలు ఏర్పాటు రైల్వే శాఖ. సామర్లకోట, తుని, అనకాపల్లి, విశాఖ మీదుగా ఈ రైలు అయోధ్యకు చేరుకుంటుంది. తిరిగి 14వ తేదీన ప్రారంభమై సామర్లకోటకు చేరుకుంటుంది.

ఇది కూడా చదవండి: టీఎస్ ఎడ్ సెట్ 2024 షెడ్యూల్ విడుదల..రాతపరీక్షతేదీ ఇదే..!!

రెండవది రాజమండ్రి నుంచి ప్రారంభమయ్యే రైలు పూర్తి వివరాలు పూర్తిస్థాయిలో రైల్వే శాఖ తెలియజేయనప్పటికీ గుంటూరు నుంచి మరో రైలు ప్రారంభమై రాజమండ్రి సామర్లకోట తుని అనకాపల్లి మీదుగా ఈ రైలు ప్రయాణం కొనసాగుతుంది. రెండు నుంచి మూడు రైళ్లు మారకుండా ఉమ్మడి జిల్లాల నుంచే ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండటంతో సామాన్యభక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఇంట్లో పప్పుకు పురుగు పడుతుందా.. అయితే ఈ టిప్స్ మీ కోసమే

#east-godavari-district #irctc #ayodhya-special-train
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe