Telangana: తెలంగాణ స్కూళ్లలో మూడో శనివారం తల్లిదండ్రులకు పాఠాలు ..విద్యాశాఖ కీలకనిర్ణయం

ప్రభుత్వరంగ విద్యా వ్యవస్థను మెరుగుపర్చడానికి నిత్యం నూతన నిర్ణయాలు తీసుకుంటున్న తెలంగాణ విద్యాశాఖ మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇక నుంచి స్టూడెంట్స్ తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి నెలా మూడో శనివారం టీచర్లు పాఠాలు చెప్పనున్నారు.

New Update
Telangana: తెలంగాణ స్కూళ్లలో మూడో శనివారం తల్లిదండ్రులకు పాఠాలు ..విద్యాశాఖ కీలకనిర్ణయం

Telangana: ప్రభుత్వరంగ విద్యా వ్యవస్థను మెరుగుపర్చడానికి నిత్యం నూతన నిర్ణయాలు తీసుకుంటున్న తెలంగాణ విద్యాశాఖ మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇక నుంచి స్టూడెంట్స్ తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి నెలా మూడో శనివారం టీచర్లు పాఠాలు చెప్పనున్నారు.

విద్యార్థుల ప్రగతిలో తల్లిదండ్రుల రోల్ కూడా కీలకమన్న విషయాన్ని వారికి తెలియజేయడంతో పాటు విద్యార్థుల చదువు విషయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన శ్రద్ధ పై పేరెంట్ టీచింగ్ మీటింగ్ ను విద్యాశాఖ నిర్వహించనుంది. దీనికి సంబంధించిన పోస్టర్ ను తెలంగాణ విద్యాశాఖ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. అయితే ప్రభుత్వ ఈ వినూత్న నిర్ణయం పై ఓ హర్షం వ్యక్తం అవుతుంటే.. కొందరు మాత్రం భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు.

 

పేరెంట్ టీచింగ్ మీటింగ్ లో ఏం చెప్తారంటే..!

చదువులో విద్యార్థులను మరింత మెరుగు పర్చాలని తెలంగాణ విద్యాశాఖ తీసుకున్న పేరెంట్ టిచింగ్ మీటింగ్ కీలక నిర్ణయంలో భాగంగా ప్రతి నెల మూడో శనివారం విద్యార్థుల తల్లిదండ్రులు తప్పని సరిగా పాఠశాలకు రావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారికి వారి పిల్లల అటెండెన్స్, వాళ్లు ఏవిధంగా చదువుతున్నారు, ఇంటి దగ్గర తల్లిదండ్రులు పోషించాల్సిన రోల్ పై ఉపాధ్యాయులు వివరిస్తారు.

కాగా, తెలంగాణ విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావ్యవస్థను మెరుగుపర్చడానికి అదే విధంగా విద్యార్థుల విషయంలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. కొన్నాళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పహారంగా రాగిజావను కూడా అందిస్తోంది. అదే విధంగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 1 నుంచి 5 వ తరగతి చదువుతున్న 16.27 లక్షల మంది విద్యార్థులకు మూడు వర్క్ బుక్స్, అదే విధంగా 6 నుంచి 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సబ్జెక్ట్ కు ఒక్కో నోట్ బుక్ చొప్పున ఇవ్వడం జరిగింది.

కానీ మౌలిక వసతులు, టీచర్ల కొరత..!

అయితే ఇప్పటికీ ఇంకా చాలా ప్రభుత్వ పాఠశాల్లో మౌలిక సదుపాయాలు లేవు. భోజన వసతి సరిగ్గా లేకపోవడంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇక ఇలా ఉంటే చాలా ప్రభుత్వ పాఠశాలలను వెంటాడుతున్న ప్రధాన  సమస్య టీచర్ల కొరత.. ఒకటో తరగతి నుంచి 5 వ తరగతి వరకు అన్నీ సబ్జెక్టులకు ఒకటే టీచర్ ఉండడం.. మాకు చదువుకు చెప్పడానికి ఉపాధ్యాయులు కావాలని విద్యార్థులే కలెక్టరేట్ల ముందు ఆందోళనకు దిగడం లాంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో వరుసగా చోటుచేసుకుంటున్నాయి. అయితే ముందు వీటి పై విద్యాశాఖ దృష్టిని సారించాలని కొందరు సూచిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు