New Rules From June: ప్రతి నెల ఒకటో తేదీ నుంచి కొత్త రూల్స్, కొత్త విధానాలను కేంద్రం అమల్లోకి తెస్తున్న విషయం తెలిసిందే. అలాగే గ్యాస్ ధరలను ఆయిల్ కంపెనీలు ప్రతి నెల ఒకటి తారీఖున కొత్త ధరలను ప్రకటిస్తాయి. అయితే జూన్ నెలలో నుంచి కొత్తగా వస్తున్న రూల్స్ ఏంటో కింద తెలుసుకుందాం..
* కొత్త డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే వారికి ఈజీగా ఉండేందుకు కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. డ్రైవింగ్ పరీక్షలను ప్రభుత్వ RTOలకు బదులుగా ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలలో తీసుకోవచ్చని పేర్కొంది.
* ఆధార్ కార్డ్ అప్‌డేట్: మీ ఆధార్ కార్డ్‌ని అప్‌డేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారా?, కాగా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలనుకునేవారికి జూన్ 14 వరకు సమయాన్ని పొడిగించి కేంద్రం.
* బ్యాంకు సెలవులు: జూన్‌లో 10 రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడతాయి. వీటిలో ఆదివారాలు, రెండు & నాల్గవ శనివారాలు ఉన్నాయి.
▪️ ఎల్పీజీ సిలిండర్ ధర: జూన్ 1న చమురు కంపెనీలు కొత్త గ్యాస్ సిలిండర్ ధరలను నిర్ణయించనున్నాయి. కాగా ధరలు పెరగడం లేదా తగ్గడం జరుగుతోంది.