బ్యాంకు ఖాతా నుంచి ఆధార్ కార్డు వరకు జూన్ 1 నుంచి మార్పులు చేపట్టిన కేంద్రప్రభుత్వం..

డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల మార్పు నుంచి బ్యాంక్ ఖాతాల వరకు.. జూన్ 1 నుంచి కేంద్రం ప్రభుత్వం మార్పులు చేయనుంది.ఇప్పటికే పంజాబ్ నేషనల్ బ్యాంక్ KYC చేయని ఖాతాలను నిలిపివేస్తుంది.

బ్యాంకు ఖాతా నుంచి ఆధార్ కార్డు వరకు జూన్ 1 నుంచి మార్పులు చేపట్టిన కేంద్రప్రభుత్వం..
New Update

బ్యాంకు ఖాతా నుంచి ఆధార్ కార్డు వరకు  కేంద్ర ప్రభుత్వం పలు మార్పులు చేయనుంది. జూన్ 1 నుంచి ఈ మార్పులు అమలు కానున్నాయి.వీటిపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇప్పటికే KYC గురించి నోటిఫై చేసింది. దీని ప్రకారం డిజిటల్ KYC చేయని వారి బ్యాంకు ఖాతా రద్దు చేయనున్నట్లు సమాచారం.

వంటగ్యాస్ సిలిండర్ ధరలో మార్పులు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సాధారణంగా సిలిండర్ ధర ప్రతి నెల ప్రారంభంలో మారుతుంది. ఈ సందర్భంలో, జూన్ 1 నుండి ధర మారుతుందని తెలిపింది.జూన్ 1వ తేదీ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ పొందడంలో కూడా మార్పు ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లి డ్రైవింగ్ పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ డ్రైవింగ్ సెంటర్లలో కూడా డ్రైవర్ పరీక్ష సౌకర్యం ఉంది.

అంతే కాకుండా కొత్త డ్రైవింగ్ రూల్స్ అమల్లోకి రానున్నట్టు సమాచారం. దీని ప్రకారం అధిక వేగంతో వెళితే రూ.1000 నుంచి రూ. 2 వేల జరిమానా విధిస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే రూ. 500 జరిమానా విధిస్తారు. అలాగే సీటు బెల్టు పెట్టుకోకుంటే రూ.100 జరిమానా విధిస్తారు.అదేవిధంగా ఆధార్ కార్డుకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. జూన్ 14 వరకు మాత్రమే ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. కాబట్టి తమ ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోవాలనుకునే వారు జూన్ 14లోగా అప్‌డేట్ చేసుకోవచ్చు.

#central-goverment
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe