Friendship Tips: అలాంటి ఫ్రెండ్స్‌తో జాగ్రత్తగా ఉండండి.. గుడ్డిగా నమ్మవద్దు! ఫ్రెండ్ ఎంత క్లోజ్ అయినా కావొచ్చు.. వాళ్లు చెప్పింది బ్లైండ్‌గా ఫాలో కావొద్దు. వాళ్లు చెప్పింది మంచో, చెడో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇక ఫ్రెండ్స్‌ను ఇంటికి ఇన్‌వైట్ చేసినప్పుడు అనవసర విషయాలు చర్చించి వారి మూడ్‌ను డిస్ట్రబ్ చేయొద్దు. By Vijaya Nimma 18 Aug 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Friendship Tips: అన్ని అర్థం చేసుకునే వాడే నిజమైన స్నేహితుడు అంటారు. ఈ మధ్యకాలంలో స్నేహానికి పెద్దగా విలువలేదు. ఒకప్పుడు స్నేహాలు, బంధాలంటే ఎంతో విలువిచ్చేవారు. కానీ ప్రస్తుత కాలంలో అంత స్వార్ధమైన జీవనాన్ని గడుపుతున్నారు. అంతేకాదు బంధాలకి, స్నేహాలకి చిన్నా పెద్ద ఎవరూ కూడా విలువ ఇవ్వడం లేదు. ఇక స్నేహితులు మధ్య ఏది దాచకూడదు అంటారు. మన కష్టాలు-సుఖాలు, మంచి, చెడు, సంతోషం ఇలా ప్రతిదీ తల్లిదండ్రులతో షేర్ చేసుకోలేకపోయినా.. మనకి నచ్చిన బెస్ట్ ఫ్రెండ్‌తో కచ్చితంగా షేర్ చేసుకుంటాం. అయితే కొందరు స్నేహితులు వాళ్ల స్వార్థానికి మనల్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్..? అలా చేయడం కరెక్టేనా..? చిన్నచిన్న పొరపాట్లే మీ ఫ్రెండ్‌ని ఏ విధంగా ఇబ్బంది పెడతాయో చూద్దాం. ఇంటికి రమ్మని పిలిచి..: 'ఇంటికి సరదాగా రా మాట్లాడుకుందాం, షాపింగ్ చేద్దాం' అంటూ చాలామంది స్నేహితులు మనల్ని ఇన్వైట్ చేస్తారు. ఇది అందరి స్నేహితులు చేసే పనే.. అయితే కొందరు స్నేహితులు ఇంటికి రమ్మని పిలిచి మనకి నచ్చని ఫుడ్డ్ పెడుతూ, వాళ్ళ పర్సనల్ విషయాలు చెప్పుకుంటూ, నచ్చని విధంగా బిహేవ్ చేస్తారు. నాలుగు గోడల మధ్య భార్యాభర్తల విషయాలు కూడా పబ్లిక్‌గా అందరి ముందే చెప్పడం పద్ధతిగా అనిపించదు. కొందరు ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇవి వాళ్లకి నచ్చ వచ్చేమో కానీ ఎదుటి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. తినమని బలవంతం ఎందుకు: ఆకలి అనేది ఒకరు తినమని చెబితేనో, ఒకరి ఏదైనా పెడితేనో గుర్తుకొచ్చేది కాదు. ఎవరి ఆకలి వాళ్ళకి తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో కొందరు డైట్, ఆరోగ్యం కోసం, వెయిట్‌లాస్, కల్తీఫుడ్డ్‌తో ఇలా ఇతర కారణాలతో బయట ఫుడ్డును అవాయిడ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఏం తినాలో.. ఎలా తినాలో.. వాళ్ళు కొంచెం హెల్త్‌పై జాగ్రత్తగా తీసుకుంటారు. అలాంటప్పుడు ఇంటికి వచ్చారు కదా.. అని వాళ్లకు నచ్చని ఫుడ్డు పెట్టి ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే దానివల్ల వాళ్ళు చాలా మానసిక ఇబ్బందికి గురవుతారు. నువ్వు ఎంత ప్రేమగా పెట్టినా సరే అది వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఆ విషయాలను కూడా కొద్దిగా దృష్టిలో పెట్టుకోకుంటే మంచిది. నీ స్వార్థం కోసం వాడుకోకు: ఏ పని చేసినా వాళ్ళకి ఉపయోగపడే విధంగా చేయాలి. నీ స్వార్థం కోసం వాళ్ళని ఉపయోగించుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ లైఫ్‌లో అనేక రకాల సమస్యలు ఉంటాయి. వాటిని పక్కనపెట్టి నువ్వు ఏదన్నా మంచి చేస్తావని ఆశతో నీ దగ్గరికి వస్తూ ఉంటారు. అలాంటప్పుడు నీకు కుదిరితే మంచి పనే చేయాలి. స్వార్థం కోసం కాకుండా గుడ్ చేయాలని చూడాలి. అంతేకానీ స్వార్థాల కోసం, టైంపాస్ కోసం మంచి చేస్తున్నట్టు వేరే వారి దగ్గర హెచ్చులకు పోవద్దు. ఏ పని చేసినా బేసిక్ తెలుసుకోవాలి: ఏ స్నేహితులైనా వారు ఏమైనా చెప్పగానే గుడ్డిగా ఫాలో అవ్వకూడదు. అది మంచిదో..చెడేదో కొద్దిగా ఆలోచించాలి. ఇంకా అంతకంటే బెటర్‌గా ఉన్న వాళ్ళ సజిషన్ తీసుకోవాలి. అందరూ మంచి చేస్తారనే గుడ్డి నమ్మకం ఈరోజుల్లో పనికిరాదు. మంచి చేసే వాళ్లకంటే స్వార్థాలకు కోసం వాడుకునే వాళ్లే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉన్నారు. ఏది మంచో.. ఏది చెడు అనేది కూడా మనం గ్రహించాలి. అంతేకానీ వాళ్లు చెప్పారు కదా.. వీళ్ళు చెప్పారు కదా.. ఫ్రెండ్ చెప్పింది కదా.. మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో అనే మొహమాటంకి పోయి జీవితాన్ని, టైంని, లైఫ్‌ని వేస్ట్ చేసుకోకూడదు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఇది కూడా చదవండి: నోటిలో ఉండే బ్యాక్టీరియా డేంజర్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! #friendship-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి