Friendship Day 2024: కేటీఆర్ ఇంటర్ ఫ్రెండ్ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. ఆయనెవరో తెలుసా?

కేటీఆర్, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఇద్దరు ఒకే కాలేజీలో ఇంటర్ చదువుకున్నారు. సంజయ్ కు రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్లు గుర్తించిన కేటీఆర్.. గత ఎన్నికల్లో ఆయనకు కోరుట్ల బీఆర్ఎస్ టికెట్ ఇప్పించారు. నేడు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈ స్టోరీ వైరల్ గా మారింది.

Friendship Day 2024: కేటీఆర్ ఇంటర్ ఫ్రెండ్ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. ఆయనెవరో తెలుసా?
New Update

నేడు ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా.. సోషల్ మీడియా అంతా ఇందుకు సంబంధించిన చర్చే ఎక్కువ జరుగుతోంది. మిత్రులంతా ఒకరికి మరొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. ఫ్రెండ్‌ షిప్ డే కు సంబంధించిన స్టోరీలు, కొటేషన్స్ విస్తృతంగా షేర్ అవుతున్నాయి. ఈ సందర్భంగా కేటీఆర్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఈ రోజు వైరల్ గా మారింది. కేటీఆర్ తో కలిసి చదువుకున్న ఓ ఫ్రెండ్ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నాడన్నది ఆ స్టోరీ సారాంశం. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
publive-image

కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, కేటీఆర్ ఇద్దరు కలిసి గుంటూరులోని విజ్ఞాన్ కాలేజీలో ఇంటర్ చదువుకున్నారు. అనంతరం సంజయ్ వైద్య విద్య పూర్తి చేసి డాక్టర్ గా మరారు. కేటీఆర్ అమెరికాలో ఎంబీఏ చేసి అక్కడే కొన్నాళ్ల పాటు ఉద్యోగం చేశారు. అనంతరం కేటీఆర్ ఇండియాకు తిరిగి వచ్చి రాజకీయాల్లో యాక్టీవ్ అయ్యారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు.
publive-image

అనంతరం రాజకీయాలపై ఆసక్తి ఉన్న తన ఫ్రెండ్ సంజయ్ ను కూడా గత ఎన్నికల బరిలోకి దించారు కేటీఆర్. స్వయంగా కోరుట్లలో ప్రచారం చేసి కల్వకుంట్ల సంజయ్ గెలుపులో కీలక పాత్ర పోషించారు కేటీఆర్. ఇప్పుడు ఈ ఇద్దరు మిత్రులు కలిసి అసెంబ్లీకి వెళ్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి