Agribusiness training: వ్యాపారాల్లో అనేక రకాల వ్యాపారాలు ఉంటాయి. వ్యవసాయ రంగం కూడా ఒకటని చెప్పొచ్చు. ఇందులో లాభాలు కూడా భారీగా ఉంటాయి. అయితే, తాజాగా యువతీ, యువకులకు మంచి అవకాశం ఇచ్చేందుకు ముందుకొచ్చింది సెంటర్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ సంస్థ. వ్యవసాయ, వ్యవసాయేతర రంగాల్లో యువతీ యువకులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు సెంటర్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ సంస్థ తెలిపింది. ఈ మేరకు సంస్థ నోడల్ ట్రైయినింగ్ ఆఫీసర్ విజయలక్ష్మి ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ ప్రకటన ప్రకారం.. జాతీయ వ్యవసాయ విస్తరణాభివృద్ధి సంస్థ సహకారంతో అగ్రి క్లినిక్, అగ్రి వ్యాపారంపై 45 రోజులపాటు హైదరాబాద్ కూకట్‌పల్లిలోని సీఈడీలో ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. శిక్షణ పూర్తి చేసిన తరువాత సదరు అభ్యర్థులకు సర్టిఫికెట్లు కూడా జారీ చేయనున్నారు. ఈ శిక్షణ తీసుకునే అభ్యర్థులకు కొన్ని అర్హతలు ఉండాలి. అభ్యర్థులు వ్యవసాయ అనుబంధ డిప్లొమా, డిగ్రీ, పీజీ, బీఎస్సీ (బీజెడ్‌సీ) కోర్సులను పూర్తి చేసి ఉండాలి. అలాగే అభ్యర్థులు తెలంగాణకు చెందిన వారై ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు శిక్షణా కాలంలో వసతి, భోజన సదుపాయం కల్పించనున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం 703666421/422/424 నంబర్లకు సంప్రదించొచ్చు. దరఖాస్తులకు తుది గడువు డిసెంబర్ 14వ తేదీగా నిర్ణయించారు.
Also Read:
ఉరకలేస్తున్న యువ రక్తం.. చిన్న వయసులో అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేలు!
పైసల్లేక పట్నం నుంచి నడిచొచ్చినా.. రూపాయి చిక్క దొరికితే బస్సు ఎక్కిన: జగ్గారెడ్డి