Free Cashless Treatment: ప్రమాదంలో గాయపడితే ఉచిత నగదు రహిత చికిత్స.. ఎలా అంటే?

రోడ్డుపై ఏదైనా ప్రమాదం జరిగి గాయపడితే ఆసుపత్రి ఖర్చుల కోసం టెన్షన్ అవసరం లేదు.  ప్రభుత్వం ప్రమాదంలో గాయపడిన వారికి 1.5 లక్షల రూపాయల వరకూ నగదు రహిత చికిత్స ఉచితంగా అందిస్తోంది. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్ గా చండీగఢ్‌ వంటి కొన్ని ప్రాంతాల్లో దీనిని అమలు చేస్తున్నారు. 

Free Cashless Treatment: ప్రమాదంలో గాయపడితే ఉచిత నగదు రహిత చికిత్స.. ఎలా అంటే?
New Update

ఒక్కసారి ఊహించుకోండి, మీరు రోడ్డు మీద వెళ్తున్నారు. అనుకోకుండా మీ ముందే యాక్సిడెంట్ అయింది. అక్కడ గాయాలతో ఉన్న వ్యక్తి సహాయం కోసం చూస్తున్నాడు. అతని చుట్టూ జనం గుంపుగా చేరారు. కానీ ఎవరూ అతనికి సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు. గాయాలతో బాధపడుతున్న ఆ వ్యక్తిని కాపాడాలని ఉన్నప్పటికీ.. వారంతా ఆలోచిస్తున్నది ఆ బాధితుడిని ఆసుపత్రికి తీసుకువెళితే చికిత్స కోసం ఆసుపత్రిలో అయ్యే ఖర్చు ఎవరు భరిస్తారు? అని.  మీరు కూడా అందరిలానే ఆలోచిస్తున్నారా? అలా ఆలోచించి సహాయం చేయడంలో మీరు కూడా వెనుకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే  రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ప్రభుత్వం 1.5 లక్షల రూపాయల వరకు నగదు రహిత చికిత్సను(Free Cashless Treatment) ఉచితంగా అందజేస్తుందని తెలుసుకోండి. ఈ సదుపాయం మీకు కూడా ఎప్పుడైనా ఉపయోగపడవచ్చు. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం….

రోడ్డు రవాణా- రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల ఒక పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి సకాలంలో వైద్యం అందించి వారి ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం ఈ(Free Cashless Treatment) పథకాన్ని ప్రారంభించింది.

ఈ ప్రాజెక్ట్ ప్రయోజనం ఇదే..
ఒక వ్యక్తి ఏదైనా మోటారు వాహనం ద్వారా ప్రమాదానికి గురై.. గాయపడిన తర్వాత ఆసుపత్రికి చేరుకుంటే, ఈ ప్రాజెక్ట్ (Free Cashless Treatment)కింద అతనికి రూ. 1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స ఉచితంగా లభిస్తుంది. ఈ పథకం ప్రకారం, ఒక వ్యక్తి గరిష్టంగా 7 రోజులు మాత్రమే చికిత్స కోసం ఆసుపత్రిలో చేరవచ్చు.

Also Read:ఈ 555 రూల్ పాటిస్తే.. రిటైర్మెంట్ లైఫ్ కోట్లతో ఎంజాయ్ చేయొచ్చు! 

ఈ చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే నేరుగా ఆసుపత్రికి చెల్లిస్తుంది. దీని కోసం ఆసుపత్రులు రీయింబర్స్‌మెంట్ బిల్లులను సమర్పించాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం ఈ పథకం (Free Cashless Treatment)చండీగఢ్‌తో సహా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద అమలులో ఉంది. త్వరలో ఇది దేశవ్యాప్తంగా అమలులోకి రావచ్చు.

ప్రభుత్వానికి ఈ ఖర్చుల డబ్బులు ఎలా వస్తాయి?
ఈ పథకానికి ప్రభుత్వానికి డబ్బు కొరత ఉండదు.  ఎందుకంటే 'మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్' నుండి నిధులు అందుతాయి. ఈ పథకం ప్రయోజనం మోటారు వాహనానికి సంబంధించిన ప్రతి రకమైన రోడ్డు ప్రమాదంలో అందుబాటులో ఉంటుంది. నేషనల్ హెల్త్ అథారిటీ క్షేత్రస్థాయిలో ఈ పథకాన్ని అమలు చేసేందుకు కృషి చేస్తుంది. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు(Free Cashless Treatment) కింద దీన్ని అమలు చేస్తోంది. ఈ పథకాన్ని అమలు చేయడానికి, పోలీసులు, ఆసుపత్రి- రాష్ట్ర ఆరోగ్య సంస్థల మధ్య సమన్వయ వ్యవస్థ ఏర్పాటు చేశారు. 

#accident #cashless-treatment
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe