/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-25-at-3.58.05-PM-jpeg.webp)
Komaram Bheem Asifabad : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో హోలీ పండుగ(Holi Festival) రోజు విషాదం చోటుచేసుకుంది. కౌటాల మండలంలో పండుగ సందర్భంగా నదీ స్నానం కోసం తాటిపల్లి వార్థ నదికి వెళ్లిన నలుగురు యువకులు గల్లంతై(Young Men Missing) మృతి చెందారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల ద్వారా యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఫోన్లు, దుస్తుల ఆధారంగా కుటుంబ సభ్యులు యువకులను గుర్తుపట్టారు. సంతోష్, కమలాకర్, సాయి, ప్రవీణ్‌గా గుర్తించారు. యువకులు మృతి చెందడంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.