ఆర్మీ జవాన్ పై పోలీసుల దాడి.. అనకాపల్లి జిల్లా ఎస్పీ సీరియస్‌ యాక్షన్‌..!

అనకాపల్లి జిల్లాలో జవాన్‌ అలీముల్లాపై దాడి చేసిన నలుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. ఈ తరహా ఘటనల్ని ఉపేక్షించేదేలేదని డిఐజి పి. హరికృష్ణ తేల్చి చెప్పారు. పోలీసులు ప్రజలతో సత్ప్రవర్తన కలిగి ఉండాలని లేని పక్షంలో ఎవరైనా సరే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఆర్మీ జవాన్ పై పోలీసుల దాడి.. అనకాపల్లి జిల్లా ఎస్పీ సీరియస్‌ యాక్షన్‌..!
New Update

Four policemen suspended : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనకాపల్లి పోలీసుల వ్యవహారంపై జిల్లా ఎస్పీ చర్యలు తీసుకున్నారు. సంతబయలులో జవానుపై దాడి చేసిన నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఈ తరహా ఘటనల్ని ఉపేక్షించేదేలేదని డిఐజి పి హరికృష్ణ తేల్చి చెప్పారు. పోలీసులు ప్రజలతో సత్ప్రవర్తన కలిగి ఉండాలని లేని పక్షంలో ఎవరైన సరే చర్యలు తప్పవని హెచ్చరించారు. జవానుపై దాడి చేసిన కానిస్టేబుళ్లను విధుల నుంచి తప్పిస్తూ జిల్లా ఎస్పీ కేవీ.మురళీకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు.

This browser does not support the video element.

పరవాడలో ప్రజా స్వామ్యానికి తల వంపులు తెచ్చేలా ప్రవర్తించారు ఏపీ పోలీసులు. మహిళా కానిస్టేబుల్‌తో సహా నలుగురు పోలీసులు ఓ సైనికుడిపై (Army Employee) దండయాత్రకు దిగారు. వందలాది మంది చూస్తుండగా ఆ జవాన్ ను అతి దారుణంగా అవమానించారు పోలీసులు. మంగళవారం పరవాడ సంతలో చోటుచేసుకున్న ఘటన పెను సంచలనం సృష్టించింది.  దిశ యాప్ డౌన్లోడ్ విషయంలో ఓ భారత సైనికుడిపై దాడికి తెగబడ్డారు. అతనిపై దాడి చేసి పోలీస్ స్టేషన్ కు బలవంతంగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసుల దాడిని స్థానికులు అడ్డుకుని నిలదీశారు.

Also Read: వై ఏపీ నీడ్స్ జగన్.. దేనికోసం..? మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సంచలన లేఖ.!

అయితే, ఈ వ్యవహారం అంతా స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.  ఏపీలో సైనికుడిని ఇంత దారుణంగా అవమానిస్తారా అంటూ ప్రజలందరూ దుమ్మెత్తిపోశారు.  ఈ ఘటనపై బాధితుడు మంగళవారం సాయంత్రం ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించ‌గా మంగళవారం రాత్రి బాధ్యుల్ని విఆర్ కు పంపి విచారణ జరిపారు. జవానుపై దాడి చేసిన కానిస్టేబుళ్లను విధుల నుంచి తప్పిస్తూ జిల్లా ఎస్పీ కేవీ.మురళీకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు.

#vishaka-police-incident #ap-police
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe