/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/GXsvf6J5v3w-HD.jpg)
Andhra Pradesh : మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన ఘటన నంద్యాల జిల్లా (Nandyala District) చాగలమర్రి మండలం చిన్న వంగలిలో జరిగింది. మృతి చెందిన వారిని గురు శేఖర్ రెడ్డి (45), దస్తగిరమ్మ(38), వారి ఇద్దరు కుమార్తెలు పవిత్ర(16), గురు లక్ష్మి(10) గా అధికారులు గుర్తించారు.
వీరంతా రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అర్థరాత్రి దాటిన తరువాత మట్టి మిద్దె కూలిపోయింది. దీంతో నలుగురు నిద్రలోనే ప్రాణాలు విడిచారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ విషయాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన శిథిలాలను తొలగించి మృతదేహాలను వెలికి తీశారు.
అయితే వీరి రెండో కుమార్తె ప్రసన్న కడపలోని ఉషోదయ పాఠశాలలో చదువుకుంటుంది. దీంతో ఆమె ఈ ప్రమాదం నుంచి బయటపడింది.
Also read: 300 కు చేరిన వయనాడ్ మృతుల సంఖ్య.. మట్టిదిబ్బల కింద ఇంకెందరో..!