/rtv/media/post_attachments/wp-content/uploads/2023/05/1219172-1176508-accident.webp)
ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మరణించారు. వేగంగా దూసుసుకువచ్చిన కారు టాటా మ్యాజిక్ వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటన అలమూరు మండలం అలిక్కి జాతీయ రహదారిపై జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా..మరో 9 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరంతా కొత్తపల్లి మండలంలోని దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.