నేడు సీఎం కేసీఆర్‎తో యూపీ మాజీ సీఎం భేటీ..!!

యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ నేడు హైదరాబాద్ కు రానున్నారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ తో ఆయన భేటీ కానున్నారు. అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ పర్యటన రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ తో లంచ్ చేసిన అనంతరం సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

New Update
నేడు సీఎం కేసీఆర్‎తో యూపీ మాజీ సీఎం భేటీ..!!

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నేడు హైదరాబాద్ కు రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తో అఖిలేష్ యాదవ్ సమావేశం కానున్నారు. ఈ సమావేశం ప్రగతి భవన్ లో జరగనుంది. మధ్యాహ్నం 12.30గంటలకు ఎయిర్ పోర్టుకు రానున్న అఖిలేష్ యాదవ్ కు బీఆర్ఎస్ నేతలు ఘనస్వాగతం పలకనున్నారు.

publive-image

అక్కడి నుంచి ప్రగతి భవన్ కు చేరుకుంటారు. కేసీఆర్ తో కలిసి అఖిలేష్ లంచ్ చేస్తారు. అనంతరం ఇరు పార్టీలకు చెందిన కొందరు ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఇరు పార్టీల నేతలు జాతీయ రాజకీయాలపై చర్చించే అవకాశం ఉంది. దాదాపు 3గంటలపాటు అఖిలేష్ యాదవ్ ప్రగతిభవన్లోనే గడపనున్నారు. అనంతరం తిరిని లక్నోకు వెళ్తారు.

ఆసక్తిరేపుతోన్న అఖిలేష్ టూర్:
అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేపుతోంది. కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు ఏకమయ్యేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ప్రతిపక్ష కూటమిలో సమాజ్ వాదీ పార్టీ కూడా ఉంది. ఈ క్రమంలోనే ఈ మధ్యే పాట్నాలో జరిగిన ప్రతిపక్షాల సమావేశానికి అఖిలేష్ కూడా హాజరయ్యారు. ఈ విపక్షాల కూటమిలో కాంగ్రెస్ సహా పలు పార్టీలన్నింటినీ బీఆర్ఎస్ కు బీటీంలు అంటూ బీజేపీ ఆరోపిస్తోంది. నిన్న ఖమ్మం లో జరిగిన బహిరంగసభలో రాహుల్, కేసీఆర్, మోడీలపై తీవ్ర ఆరోపణలు చేశారు. కర్నాటకలో బీజేపీని ఘోరంగా ఓడించినట్లుగానే తెలంగాణలోనూ అదే సీన్ రిపీట్ అవుతుందన్నారు.

ఈసమయంలో అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ టూర్ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ తో భేటీ అవ్వడం...హాట్ టాపిగ్గా మారింది. ప్రతిపక్షాలు ఐక్యతదిశాగా సాగుతున్న సందర్భంగాలో మహారాష్ట్రలో ఎన్సీపీ చీలిపోవడం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు